వృషభ రాశిలోకి శుక్రుడు.. మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఇలా చెయ్యండి
మే నెలలో వృషభ రాశిలో అనేక ముఖ్య గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇక నేడు వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. నేడు ఉదయం 8 గంటల 29 నిమిషాలకు వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. అప్పటికే సూర్యుడు వృషభ రాశిలో ఉండడం వల్ల శుక్రుడు, సూర్యుడు కలయిక తోటి నేడు శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుక్రాదిత్య రాజయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలు పైన ప్రభావం చూపిస్తుంది.
జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే లగ్జరీ లైఫ్
ముఖ్యంగా ఈ రాజయోగం కారణంగా వృషభ రాశి, మిధున రాశి, సింహ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది.ఇదిలా ఉంటే జాతకంలో శుక్రుడు బలంగా ఉండడం చాలా అవసరం. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క జన్మ చార్ట్ లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో సుఖసంతోషాలను అనుభవిస్తారు. జీవితంలో అన్ని విలాసాలను, సౌకర్యాలను పొందుతారు. శృంగారం వర్ధిల్లుతుంది. భౌతిక సుఖాలతో ఆనందంలో తేలియాడుతారు.

బలహీన శుక్రుడితో కష్టాలు ఇలా
ఇక శుక్రుడు బలహీనంగా ఉంటే వైవాహిక విభేదాలు, భార్యాభర్తల మధ్య పంచాయతీలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక, శారీరక సమస్యలు, సామాజిక కష్టాలు కూడా వస్తాయి. మరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు బలోపేతం చేయడానికి కూడా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.
శుక్రుడిని బలోపేతం చేసే పరిహారాలు
జాతకంలో శుక్రుని బలోపేతం చేసేందుకు శుక్రవారం ఉపవాసాలు చేయడం మంచిది. అంతే కాదు మీ భోజనంలో పాలు, పెరుగు, బియ్యం, మరియు చక్కెర ఉండేలాగా చూసుకోవాలి. శుక్ర గ్రహం బలోపేతం కావటానికి కొన్ని దానం చేయాలి. సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగించే సాధనాలు, కర్పూరం, స్వీట్లు, పెరుగు వంటి వాటిని దానం చేస్తే శుక్ర అనుగ్రహం ఉంటుంది.
శుక్రవారం ఈ పని చెయ్యాలి
జాతకం ప్రకారం వజ్రాన్ని కానీ ఓపల్ రత్నాన్ని కానీ ధరించాలి. దీంతో శుక్రుడు బలోపేతం అవుతాడు. శుక్రవారం ఇంట్లో పూజ చేయడం, పేద బ్రాహ్మణునికి తెల్లని రంగు దుస్తులు, సువాసన గల వస్తువులు దానం చేయడం చేస్తే కూడా జాతకంలో శుక్రుడు బలోపేతం అవుతాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications