శ్రావణంలో ఈ రాశులవారిపై శుక్ర కటాక్షం.. వీరికి విలాస యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశుల సంచారం, నక్షత్ర సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారడమే కాకుండా నక్షత్ర మార్పు కూడా చేస్తూ ఉంటాయి. అలా విలాసాలకు, సంపదలకు ప్రత్యేకంగా చెప్పబడే శుక్రుడు ఆగస్టు 11వ తేదీన పూర్వ ఫాల్గుణి( పుబ్బ) నక్షత్రంలోనికి ప్రవేశించనున్నాడు. శ్రావణ మాసంలో శుక్ర నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి విలాసాలను ఇస్తుంది.

పుబ్బ నక్షత్రంలోకి శుక్రుడు
ఆగస్టులో శుక్ర నక్షత్ర గోచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది. .పూర్వఫాల్గుణి నక్షత్రాన్నే పుబ్బ నక్షత్రం అని కూడా అంటారు. ఈ పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు తన సొంత నక్షత్రమైన పూర్వ ఫాల్గుణి( పుబ్బ) నక్షత్ర సంచారం అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Venus Nakshatra transit in sravanamasam gives these zodiac signs luxuries and wealth

మిధున రాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మిధున రాశి వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. మిధునరాశి జాతకులు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. మిధునరాశి జాతకుల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పనిచేసే చోట గుర్తింపును పొందుతారు. ఈ సమయంలో మిధున రాశి వారి ఆదాయం మెరుగుపడుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.

సింహ రాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారిపై శుక్రుడు దయ పుష్కలంగా ఉంటుంది. సింహరాశి వారికి సంపదలు వస్తాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు లాభిస్తాయి. పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభరాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం కుంభరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారు ఇప్పుడు నూతన ఉద్యోగ అవకాశాలను పొందే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు వస్తాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి తిరిగి సంతోషంగా కుటుంబంతో గడుపుతారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+