శుక్ర దశతో మారిపోనున్న జాతకాలు..ఈ రాశుల వారికి రాజభోగం
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. శుక్రుడు శుభ గ్రహంగా పరిగణించబడతాడు.శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు .. ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే దానిపై అతని ప్రభావం ఆధారపడి ఉంటుంది. శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభం , తులారాశిలో బలమైన స్థితిలో ఉంటాడు. శుక్రుడు మీనం రాశిలో కూడా బలమైన స్థితిలో ఉంటాడు. శుక్రుడు మేషం , వృశ్చిక రాశిలో బలహీనంగా ఉంటాడు. శుక్రుడు తిరోగమనం వలన కొంతమంది జీవితాల్లో శుక్ర దశ ప్రారంభం కాబోతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఉపయోగకరంగా ఉండబోతుంది. శుక్ర దశ వల్ల శుభయోగం పొందే రాశులను ఓసారి పరిశీలిద్దాం.
మీన రాశి:
శుక్ర దశ ప్రభావం మీన రాశి వారిపై పుష్కలంగా ఉండనుంది. ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి కలిసి వస్తోంది. ఆర్ధిక లాభం చేకూరే అవకాశం కనిపిస్తోంది.

ధనుస్సు రాశి:
శుక్రుడు తిరోగమనం ధనుస్సు రాశి వారికి కూడా అనుకూలంగానే ఉండనుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారు మెరుగైన స్థానంలో ఉండనున్నారు.వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. అయితే ఈ రాశి వారు వివాహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
తులా రాశి:
శుక్రుడు వక్ర గమనం వలన తులా రాశి వారికి శుభయోగకరంగా ఉండనుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తి అయ్యే అవకాశాలున్నాయి.వ్యాపారంలో అభివృద్ది సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.
కుంభ రాశి:
శుక్ర దశ అనుగ్రహం కుంభ రాశి వారికి సైతం దక్కనుంది.ఈ రాశి వారు తమ కష్టానికి ప్రతిఫలం అందుకుంటారు.కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఆదాయం పెరుగుతుంది.
మేష రాశి:
మేష రాశి వారికి శుక్రుని ప్రభావం కనిపించనుంది. విద్యార్ధులకు విదేశియానం ఉండనుంది.వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరతారు.ఆర్థికంగా ఈ రాశివారు బలంగా మారే అవకాశలున్నాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్ లో అందించిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది.












Click it and Unblock the Notifications