అక్టోబర్ లో వీరికి సంపదలు, విలాసాలు.. శుక్రుడి శాసనం!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. గ్రహాలు వివిధ నక్షత్రాలలోకి కూడా సంచారం చేస్తూ ఉంటాయి. ఈ గ్రహాల కదలికలు అన్ని రాశుల వారిపైన, ప్రపంచం మొత్తంపైన కూడా ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిషశాస్త్రంలో సంపదలకు, విలాసాలకు, ప్రేమకు ప్రతీకగా భావించే శుక్రుడు అక్టోబర్ మాసంలో కన్య రాశిలో ప్రవేశిస్తాడు.

అక్టోబర్ లో కన్యా రాశిలో శుక్ర సంచారం
అక్టోబర్ 9వ తేదీన శుక్రుడు కన్య రాశిలోకి సంచారం చేస్తాడు. కన్యా రాశికి బుధుడు అధిపతి. అటువంటి కన్యా రాశిలోకి శుక్ర సంచారం కొన్ని రాశులకు మేలు చేస్తుంది. శుక్రుడు, బుధుడు స్నేహ బంధాన్ని కలిగి ఉండడం వల్ల కొన్ని రాశులకు లబ్ధి జరుగుతుంది. దీపావళికి ముందు శుక్రుడు కన్యారాశిలోకి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన శుభ ఫలితాలు వస్తాయి. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

Venus promises these zodiac signs wealth and luxuries in October

సింహరాశి
శుక్ర సంచారం సింహ రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు కన్యారాశిలో ధన, వాక్కు స్థానంలో ప్రవేశిస్తున్న కారణంగా వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. సింహరాశి వారి డబ్బు తిరిగి వస్తుంది. వీరి మాట ప్రభావం కూడా పెరుగుతుంది. సమాజంలో సింహ రాశి వారికి మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి
కన్యారాశిలో శుక్ర సంచారం వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు వృశ్చిక రాశిలో ఆదాయ మరియు లాభ స్థానాలలో సంచరిస్తాడు. దీనివల్ల ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ఆదాయ స్థాయి పెరుగుతుంది. పనిచేసే చోట ఉన్నత స్థానాన్ని పొందుతారు. పెట్టిన పెట్టుబడులు గొప్ప విజయాన్ని సాధిస్తాయి. ఈ సమయంలో మంచి సంపదను కూడగట్టుకుంటారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి
శుక్ర సంచారం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ధనుస్సు రాశిలో కర్మ స్థానంలో శుక్ర సంచారం జరగబోతున్న కారణంగా చేసే పనిలోనూ, వ్యాపారం లోను ధనుస్సు రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక స్థిరత్వం వస్తుంది. వివిధ ఒప్పందాల నుండి వీరికి లబ్ది జరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ర్యాంకు సాధిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+