ఈ వారంలోనే శుక్రుడి తిరోగమనం.. 8 రాశులవారి దశ తిరిగినట్టే!!
ఈ వారంలో గ్రహాల కదలికల వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాలలో అనేక మార్పులు సంభవించనున్నాయి. ముఖ్యంగా శుక్రుడి తిరోగమనం వల్ల అన్ని రాశుల వారి పైన ఖచ్చితమైన ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి శుక్రుడి తిరోగమనం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇక ఆ రాశుల వారు ఎవరు అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
శుక్రుడు సింహరాశిలో జూలై 23వ తేదీన తిరోగమనం చెందనున్నాడు. సింహరాశిలో శుక్రుడు తిరోగమనం సింహరాశి తో పాటు అనేక రాశుల వారికి మేలు కలిగిస్తుంది. సింహరాశిలో శుక్రుడి తిరోగమనం మేష రాశి వారికి చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశి వారు ఆర్థిక పురోగతిని చూస్తారు. పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. ఏ వ్యాపారం చేసినా ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి వారి దశ తిరుగుతుంది.

సింహరాశిలో శుక్రుడి తిరోగమన ఫలితంగా వృషభ రాశి జాతకులకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం చేకూరుతుంది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం ఉంది. పై అధికారుల మనలను పొందుతారు. ఇప్పుడు ఏ పని చేసినా విజయం సాధిస్తారు.
సింహరాశిలో శుక్రుడి తిరోగమనం వల్ల కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శుక్రుని తిరోగమన చలనం ఉద్యోగంలో మంచి అవకాశాలను కల్పిస్తుంది. కన్యారాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం.
తులారాశి జాతకులకు శుక్రుడి సింహరాశిలో తిరోగమనం లాభిస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. శుభ వార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో కూడా ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది. శుక్రుని తిరోగమనం వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన నెరవేరుతుంది. వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతిని పొందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి జాతకులకు శుక్రుని తిరోగమన ప్రభావం మేలు చేకూరుస్తుంది. శుక్రుని తిరోగమన ప్రభావంతో ధనుస్సు రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల వస్తుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. వీరు సంతోషంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
శుక్రుడు మకర రాశి వారికి శుభగ్రహం కాబట్టి మకర రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా సానుకూలంగానే ఫలితం ఉంటుంది. అనుకున్న అన్ని పనులు నెరవేరుతాయి. శుక్రుని తిరోగమనం వల్ల మీన రాశి వారికి మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మారుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీన రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications