వీరికి విలాసాలు, రాజభోగాలు మొదలయ్యాయి.. సుఖీభవ అన్న శుక్రుడు!
విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు 2025 సంవత్సరంలో తొలిసారి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు. జనవరి 4వ తేదీన ఉదయం 4 గంటల 47 నిమిషాలకు శుక్రుడు శతభిషా నక్షత్రం లోకి ప్రవేశించాడు. జనవరి 17 ఉదయం 7 గంటల 51 నిమిషాల వరకు శుక్రుడు శతభిషా నక్షత్రంలో ఉండి ఆపై పూర్వాభాద్ర నక్షత్రంలోకి వెళతాడు. శుక్రుడి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. ఆ రాశులేమిటి తెలుసుకుందాం.
మేష రాశి
శుక్రుడు శతభిషా నక్షత్రంలో సంచరించటం కారణంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి వారు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. డబ్బు సంపాదించడానికి మేషరాశి వారికి ఇది సరైన సమయం. మేషరాశి వారికి సంపద స్థానంలో శుక్రుడు ఉండడంతో ఇది ఊహించని ఆర్థిక లాభాలను శ్రేయస్సును ఇస్తుంది. వృత్తిపరంగాను కలిసి వస్తుంది సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మిధున రాశి
శతభిష నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది .మిధున రాశిలో తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మీరు సానుకూల మార్పులను చూస్తారు. ఈ రాశి వారి జీవితంలో ఇది విజయాలకు కారణమవుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా, వృత్తిపరంగానూ పురోగతికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇది అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది..
వృశ్చిక రాశి
సంపదలకు అధిపతి అయిన శుక్రుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించటం వల్ల వృశ్చిక రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. నూతన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. శుక్రుడు శతభిషా నక్షత్రంలోకి వెళ్లడం వల్ల ఈ సమయం మీ జీవితానికి కొత్త టర్నింగ్ పాయింట్ గా మారుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి అభివృద్ధి చేయడానికి ఇది గొప్ప అవకాశం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications