అనూరాధ నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి అక్టోబర్ 27వరకు డబ్బే డబ్బు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మాత్రమే కాకుండా ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రం లోకి కూడా సంచారం చేస్తాయి. ఇక నేడు అర్ధరాత్రి 12. 12 నిమిషాలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు అనురాధ నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు.
శుక్రడు అనూరాధ నక్షత్రంలోకి
తిరిగి అక్టోబర్ 27వ తేదీన శుక్రుడు అనురాధ నక్షత్రాన్ని వీడి జ్యేష్ఠ నక్షత్రంలోకి వెళతాడు. అయితే శుక్రుడి నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తోంది . శుక్ర నక్షత్ర సంచారం ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.

ఆకస్మిక ధనలాభం పొందే రాశులు
ఎవరి జాతకంలో అయితే శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడు వారికి సంపదల వర్షం కురుస్తుంది .ఆ జాతకులు విలాసాల లో మునిగి తేలుతారు. తాజాగా శుక్రుడి నక్షత్ర మార్పు కారణంగా వృషభ రాశి, ధనుస్సు రాశి, కుంభ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ రాశుల వారు ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
వృషభ రాశి
శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి మార్పు చెందడం వల్ల వృషభ రాశి జాతకులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా పురోగతి కనిపిస్తుంది .ఆర్థికంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులు బలోపేతం అవుతారు. ఇక విద్యార్థులకు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
ధనుస్సు రాశి
శుక్రుడు అనూరాధ నక్షత్రం లోకి మార్పు చెందడం వలన ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఇప్పుడు ధనుస్సు రాశి జాతకులు ఏ పని చేసినా కూడా విజయం వరిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ సమయంలో ఉపశమనాన్ని పొందుతారు.
కుంభరాశి
శుక్రుడు అనురాధ నక్షత్రం లోకి మార్పు చెందడం కారణంగా కుంభ రాశి జాతకులకు ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి. శుక్రుని ఆశీర్వాదం కారణంగా కుంభ రాశి వారు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కుంభ రాశి వారు ఈ సమయంలో అప్పుల బాధల నుండి బయటపడతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications