మూల త్రికోణ రాశిలో శుక్రగోచారం.. వీరికి అఖండ ధనయోగం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడు విలాసాలకు అధిపతి. శుక్రుడు సంతోషాన్ని, సంపదను, శ్రేయస్సును, ప్రేమను ఇస్తాడు. జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే, శుభ స్థానంలో శుక్రుడు ఉంటే ఆ వ్యక్తి విలాసాలలో మునిగితేలుతాడు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఆపై శుక్రుడు జులై 31వ తేదీన సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.
మూల త్రికోణ రాశిలోకి శుక్ర సంచారం
ఆగస్టు 24వ తేదీ వరకు శుక్రుడు ఇదే రాశిలో ఉండి ఆపై కన్యారాశిలోకి సంచరిస్తాడు. కన్యారాశి నుండి శుక్రుడు సెప్టెంబర్ 18 2024న తన మూల త్రికోణ రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తులారాశిలో శుక్ర సంచారం సెప్టెంబర్ 18మధ్యాహ్నం 2.04నిమిషాలకు జరుగుతుంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత శుక్రుడు తన సొంతరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్ర గోచారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

మేషరాశి
శుక్రుడు మూల త్రికోణరాశి అయిన తులా రాశిలో సంచరించిన సమయంలో మేష రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుక్ర సంచారం మీ జాతకంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. శుక్రుడు దయతో అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం.
కర్కాటక రాశి
శుక్రుడు మూల త్రికోణ రాశి అయిన తులారాశిలో సంచరించడం కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. వీరికి ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుంది. కష్టానికి తగిన ఫలితాన్ని కచ్చితంగా పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం చేసే చోట పని భారం పెరిగినప్పటికీ మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది.
తులారాశి
శుక్ర సంచారం కారణంగా తులా రాశి వారికి అదృష్టం పట్టబోతోంది. ఈ సమయంలో తులా రాశి వారు కొన్ని శుభవార్తలను వింటారు. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుక్ర సంచారం సమయంలో మీరు సంపన్నులు అవుతారు.
కుంభరాశి
శుక్ర సంచారం కారణంగా కుంభరాశి వారి జీవితాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. కుంభరాశి జాతకులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో కుంభరాశి జాతకులు కొన్ని శుభవార్తలను వింటారు. ముఖ్యంగా పిల్లలనుండి మద్దతు లభిస్తుంది. వర్ధక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications