మీనరాశిలో శుక్రుడు... ఈ రాశులకు గోల్డెన్ పిరియడ్ స్టార్ట్

నవగ్రహాల్లో కీలకమైన శుక్రుడు సంపదకు, సుఖ జీవితానికి, ఐశ్వర్యానికి, విలాసాలకు కారకుడు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉండే ఆ జాతకానికి తిరుగుండదు. వచ్చే నెల ప్రారంభంలో శుక్రుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఎప్పుడూ కదిలేవిధంగా కాకుండా మీనరాశిలో తిరోగమన దిశలో ప్రయాణం కొనసాగిస్తాడు. ఈ ప్రభావం మొత్తం ద్వాదశ రాశులపై ఉంటున్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులవారిపై మాత్రం అధిక ప్రభావం ఉంటోంది. మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు మీనరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తాడు. దీనివల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు, అలకలు తొలగిపోతాయి. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఎదుటివారితో మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. కుటుంబం కుదుటపడతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

venus will enter pisces from march 25th three zodiac signs will get financial benefits and huge money

మీన రాశి
ఈ రాశివారికి వ్యాపారం బాగా కలిసివస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆర్థికంగా ఈ రాశివారి కుటుంబాలు ఒక స్థాయికి చేరుకుంటాయి. ఏది అవసరమో అంతవరకే భగవంతుడు ఇస్తుంటాడు. వీరు పనిచేస్తున్నచోట పెద్ద పెద్ద విజయాలను సాధిస్తారు. ఎదుటివారు మీ వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు. మాటతీరు చాలా మృదువుగా ఉండాలి.

కర్కాటక రాశి
అదృష్టం ఈ రాశివారిని బంకలా పట్టుకుంటుంది. దీనివల్ల ఆర్థికంగా బాగా మంచి స్థితికి చేరుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ప్రేమలో ఉన్నవారు చింత పడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారి భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటంవల్ల వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. ఈ స్థానంలోనే తిరోగమనం చేయనున్నాడు. సంపాదించిన సొమ్మును పొదుపు చేయడంతోపాటు శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ, శుక్రుడికి పూజలు చేయడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+