ఈ 15రోజుల్లో డబుల్ సంచారంతో డబుల్ సంపదలను, రాజభోగాలను ఇస్తున్న శుక్రుడు!

వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. శుక్రుడు విలాసాలకు అందానికి సంపదలకు అధిపతి. అటువంటి శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి, ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రంలో కి సంచారం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా శుక్ర సంచారం జరిగినప్పుడు ద్వాదశ రాశులు ప్రభావితమవుతాయి. అయితే జూలై మాసంలో రాబోయే 15 రోజుల్లో శుక్రుడు రెండుసార్లు తన స్థానాలను మార్చుకో బోతున్నాడు.

ఈ 15 రోజుల్లోనే రెండుసార్లు శుక్ర సంచారం
జూలై 8వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన శుక్రుడు జులై 20వ తేదీన మృగశిర నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జులై 26వ తేదీన మిధున రాశిలోకి వెళతాడు. ఇలా శుక్రుడు రెండుసార్లు నక్షత్రంలోనికి, రాశిలోకి సంచారం చేయడం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తాయి. జూలై మాసంలో వచ్చే 15రోజుల్లో శుక్రుడు డబుల్ సంచారం ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం.

Venus with its double transit during these 15 days is giving double wealth and royal pleasures

మేషరాశి
శుక్ర సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కాబట్టి వీరికి ఈ సమయంలో మంచి సంపద లభిస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు శుక్ర సంచారం కలిసి వస్తుంది. శుక్రుడు వృషభ రాశి వారికి అధిపతి కాబట్టి, ఈ రాశి వారికి సిరిసంపదలను కీర్తిని ఇస్తాడు శుక్రుడు. శుక్ర సంచారంతో వీరు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమైన వారికి విజయలక్ష్మి వరిస్తుంది. మంచి ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

తులారాశి
తులారాశి జాతకులకు శుక్రుడు తన సంచారంతో శుభాలను చేకూరుస్తున్నాడు. తులా రాశికి శుక్రుడు అధిపతి కావడంతో తులారాశి జాతకులు ఈ సమయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. తులా రాశి జాతకులకు ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+