దీపావళికి విపరీత రాజయోగంతో నక్కతోక తొక్కేది వీరే!

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం దీపావళి పండుగ అరుదైన రాజ యోగాలతో అన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతుంది. అదృష్టాన్ని ఇచ్చే బృహస్పతి అక్టోబర్ 18వ తేదీన అంటే నేడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశి లోనే ఉంటాడు.

విపరీత రాజయోగం.. అదృష్ట రాశులు
బృహస్పతి కర్కాటక రాశి లో సంచరించే సమయంలో, బృహస్పతి రాశి అయిన మీనరాశిలో శని తిరోగమనంలో సంచరిస్తూ ఉంటాడు. శని, మరియు బృహస్పతి ల కలయిక విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. 12 సంవత్సరాల తర్వాత ఈ విధంగా విపరీత రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

vipreet rajyoga with jupiter and saturn gives luck to these zodiac signs

సింహరాశి
సింహరాశి జాతకంలో 6 మరియు ఏడవ గృహాలను పాలించే శని 8వ గృహంలో ఉంటాడు. సింహరాశి జాతకులకు శని యొక్క సడే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో వీరి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కెరీర్ కు అడ్డంకులు తొలగుతాయి. రియల్ ఎస్టేట్ మరియు వాహన సంబంధిత వెంచర్ల నుండి గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు శని మరియు బృహస్పతి సంయోగం కారణంగా ఏర్పడే విపరీత రాజయోగం అనేక ప్రయోజనాలను తెస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది .ధనుస్సు రాశి వారు వ్యాపారంలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు.

తులారాశి
తులా రాశి జాతకులకు శని మరియు బృహస్పతి సంయోగం కారణంగా ఏర్పడే విపరీత రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులా రాశిలో 6వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. బృహస్పతి స్థానానికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు. దీంతో ఈ రాశిలో జన్మించిన వారు అనేక రంగాలలో అపారమైన విజయాలను పొందుతారు. వీరి సామాజిక స్థితి వేగంగా మారుతుంది. జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. పనిలో మీ స్థానం బలపడుతుంది. కెరీర్లో కొత్త విజయాలు వస్తాయి.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+