ఇంట్లో రెండు బీరువాలు, లాకర్లు ఉన్నాయా? ఎక్కడ పెడితే ఐశ్వర్యం?
సొంత ఇల్లయినా, అద్దె ఇల్లయినా మనం నివసించే ప్రాంగణంలో సానుకూల శక్తి ఉండటం చాలా ముఖ్యం. వాస్తు దోషాలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉండేవారికి, బీరువాల సర్దుబాటు విషయంలో చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. వాస్తు నిపుణులు ఇస్తున్న ప్రాముఖ్యమైన సూచనలు ఇవే. సాధారణంగా పాత కాలపు ఇళ్లలో కప్ బోర్డులు ఉండేవి, కానీ ఆధునిక అద్దె ఇళ్లలో అవి లేనప్పుడు బీరువాలే గతి. కొంతమంది లాకర్లు కూడా పెట్టుకుంటారు.
నైరుతి మూలలో స్థిరత్వం
మరి రెండు బీరువాలు లేదా రెండు లాకర్లు ఉన్నప్పుడు వాటిని ఎలా సర్దాలి? అనేది చూద్దాం. బరువులు ఎప్పుడూ నైరుతి మూలలో ఉంటేనే ఆ ఇంట్లో స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి ఉంటాయి. ఒక బీరువాను బెడ్‌రూమ్‌లో నైరుతి దిశలో అమర్చుకోవాలి. రెండో బీరువాను హాల్‌లో గానీ లేదా మరో గదిలో గానీ మళ్ళీ నైరుతి దిశలోనే ఉంచడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అక్కడ అసలు స్థలం లేకపోతే.. ఆందోళన చెందాల్సిన పనిలేదు. దక్షిణ గోడ వైపు మధ్యలో పెట్టుకోవచ్చు.

ప్రధాన ద్వారం వద్ద వెలుతురు ఉండాలి
పడమర గోడ వైపు మధ్యలో అమర్చుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో బరువులు ఉంచడం వల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవు సంచిత లాభాలు కలుగుతాయి. బీరువా తలుపులు ఎప్పుడూ ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు తెరుచుకునేలా ఉండటం శుభప్రదం. అద్దె ఇంట్లో ఉన్నా సరే, ఈశాన్య మూల ఖాళీగా, తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంటి సింహద్వారం వద్ద వెలుతురు సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి.
మన గమనాన్ని మార్చే శక్తి వాస్తుకు ఉంది
వాస్తు అనేది కేవలం భవన నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదు, అది మన జీవన గమనాన్ని మార్చే ఒక శక్తి. సరైన దిశలో వస్తువులను అమర్చుకోవడం ద్వారా అద్దె ఇంట్లో కూడా అఖండ ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను పొందవచ్చు.












Click it and Unblock the Notifications