రెండురోజుల్లో అద్భుతయోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం వలన వివిధ యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. నవగ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం. చంద్రుడు ప్రతి రాశిలో దాదాపు రెండున్నర రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు, ఇతర గ్రహాలతో సంయోగం జరిపినప్పుడు కొన్నిసార్లు శుభయోగాలు, మరికొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి.
చంద్ర, బృహస్పతి సంయోగంతో గజకేసరి రాజయోగం
చంద్రుడు మరియు బృహస్పతి సంయోగం జరిపినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. మార్చి 5వ తేదీన ఉదయం 8.12 నిమిషాలకు బృహస్పతి ఉన్న వృషభ రాశిలోకి చంద్రుడు సంచారం చేయడం వల్ల శక్తివంతమైన గజకేసరి రాజు యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం 12 రాశుల వారి జీవితాల పైన ప్రభావం చూపించడమే కాకుండా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారి లగ్న గృహంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇదే వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.వృషభ రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో పురోగతిని పొందుతారు. దీర్ఘకాలిక సవాళ్లు ముగిసిపోతాయి. ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. సంపదలు పెరుగుతాయి. వృషభ రాశి వారి జీవితంలోని అన్ని రంగాలలో పురోగతికి అవకాశాలను ఇస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారి 12వ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల మిధున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మిధున రాశి వారి జీవితంలో పురోగతికి అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్నవారు గొప్ప వృద్ధిని సాధిస్తారు. ఈ దశ మీ జీవితంలో సంతోషాలను, విజయాలను తెస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో భవిష్యత్తు ప్రయోజనాలకు కావలసిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి పదకొండవ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల వీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతోషకరమైన పని వాతావరణం ఉంటుంది. నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. కెరీర్ లో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఏది కోరుకున్నా ఈ సమయంలో నెరవేరుతుంది.పనిలో మీ ప్రయత్నాలకు మంచి ప్రతిఫలం వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications