నవ పంచమ రాజయోగంతో వీరికి కనకవర్షం మొదలైంది!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, ఆ గ్రహాలు రాశులలో చేసే సంయోగం చాలా ముఖ్యమైనవి. ఇవి అన్ని రాశులవారి జీవితాలని ప్రభావితం చేస్తాయి. అయితే ప్రస్తుతం కలియుగ రాజుగా పరిగణించబడే రాహువు, శుక్రుడుతో కలిసి నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ప్రస్తుతం శుక్రుడు తులా రాశిలో ప్రవేశించాడు.
నవ పంచమ రాజయోగం
ఈ రాశిలో రాహువు 5వ ఇంట్లో మరియు కుంభరాశిలో శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు. ఇది నవ పంచమ రాజయోగం సృష్టించింది. దీని కారణంగా కొన్ని రాశులకు అదృష్టం రాబోతుంది. నవ పంచమ రాజయోగంతో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

తులారాశి
తులారాశిలో శుక్రుడు లగ్న గృహంలో, రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఏర్పడిన నవపంచమ రాజయోగం తులారాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పరిశ్రమలో ఉన్నవారికి గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి .ఫ్యాషన్ డిజైనింగ్, అలంకరణ, హోటల్స్ మొదలైన రంగాలలో వ్యాపారం చేసేవారు లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో తులారాశి జాతకులు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు.
కుంభరాశి
కుంభరాశిలో శుక్రుడు అదృష్ట గృహంలోనూ, రాహువు లగ్న గృహంలోనూ ఉన్నారు .దీంతో కుంభరాశిలో నవ పంచమ రాజయోగంతో వీరికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయాలలో ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసిన లబ్ధి చేకూరుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి కలిసి వస్తుంది. చాలాకాలంగా ఆలోచిస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఇది కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే రాజయోగం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు నవ పంచమ రాజయోగంతో అన్ని విధాల లబ్ధిని పొందుతారు. రాహువు మూడవ ఇంట్లో, శుక్రుడు 11వ ఇంట్లో ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ఇది వీరి విజయ ద్వారాలను తెలుస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో కొన్ని చిన్న ప్రయాణాలను చేసే అవకాశం ఉంటుంది. వీరికి స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఎంతో కాలంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది ధనుస్సు రాశి వారికి ప్రయోజనాలు చేకూర్చే సమయం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications