జూన్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాశి ఫలాలు
ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అన్ని రాశులవారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి : మానసికంగా ఇక్కట్లకు గురిచేసేవారున్నారు. మనో బలంతో నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు బాగుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
వృషభరాశి : ఏ విషయాన్ని బాగా లోతుగా ఆలోచించవద్దు. దీనివల్ల ఇబ్బందులే ఎదురవుతాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో మృదువుగా సంభాషించాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. శుభవార్తను వింటారు.
మిథున రాశి : వ్యాపారంలో తలెత్తే ఇబ్బందుల నుంచి విజయవంతంగా బయటపడతారు. చంచలత్వం ఉంటుంది. దీనివల్ల సమస్యలు పెరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇష్టదేవతను స్మరించుకోవడంతోపాటు చేసే ప్రతి పని కుటుంబ సభ్యులకు చెప్పి చేస్తే కలిసివస్తుంది.
కర్కాటక రాశి : ఉద్యోగస్తులకు బాగుంది. తెలివితేటలతో పై అధికారులను మెప్పిస్తారు. వ్యాపారం బాగుంటుంది. విమర్శల్ని పట్టించుకోవద్దు. భూమి, వాహన యోగాలున్నాయి. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
సింహ రాశి : అనుకున్న పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కన్యారాశి : ఉద్యోగంలో మేలు కలుగుతుంది. మీరు ధర్మంగా ఉంటే అది మిమ్మల్ని కాపాడుతుంది. నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి. శుభవార్త వింటారు. వ్యాపారంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి : పనుల్లో విజయం సాధించాలంటే ఏకాగ్రతను పెంచాలి. ఉద్యోగంలో కష్టం పెరుగుతుంది. మంచి భవిష్యత్తుకై ఎదురు చూస్తుండాలి. అపార్థాలకు చోటులేకుండా చూసుకోవాలి. ఏ పనికైనా అడుగడుగునా విఘ్నాలుంటాయి.
వృశ్చిక రాశి : కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధర్మమార్గంలో చేసే పనులకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. ఓర్పుతో ముందుకు వెళుతుండాలి.
ముందస్తు ప్రణాళికలతో నష్టాన్ని నివారించవచ్చు.
ధనుస్సు రాశి : ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. భూమి, వాహన యోగాలున్నాయి. ఏ పని ప్రారంభించినా తేలిగ్గానే విజయం లభిస్తుంది. ఇంటా బయటా రెండుచోట్ల కలిసివస్తుంది.
మకర రాశి : కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎంతో శాంతంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండటంతోపాటు మొహమాటంవల్ల పెరిగే ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఆపద నుంచి బయటపడతారు.
కుంభ రాశి : ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. భూమికి సంబంధించిన యోగం ఉంది. పనులేవీ మధ్యలో ఆపొద్దు. సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
మీన రాశి : ధన లాభం ఉంది. సరైన ప్రణాళికలవల్ల స్థిరత్వం వస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో శుభయోగంతోపాటు వ్యాపరం మిశ్రమంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications