weekly horoscope: మేషరాశి నుండి కన్యారాశి వరకు.. ఎవరికి అదృష్టం? ఎవరికి దురదృష్టం?

ఈవారం మేష రాశి నుండి కన్యా రాశి వరకు ఆరు రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. మేష రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. వివిధ వ్యాధుల నుండి బయటపడటానికి ఈవారం మీరు చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. వారం ప్రారంభంలో అనేక వనరుల నుండి డబ్బులు వస్తాయి.

ఈ సమయంలో మీరు మీ బంధువులకు ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంది. వారికి రుణాలు ఇవ్వద్దని సలహా కూడా ఇవ్వబడింది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో నష్టాల నుండి బయటపడడానికి అవసరమైన సహాయాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయంలో మంచి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా చదువులో విజయాలను సాధిస్తారు.

weekly horoscope: From Aries to Virgo.. what horoscope says?

వృషభ రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఈ వారం వృషభ రాశి జాతకులకు కొన్ని ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆఫీసులో పనులకు కూడా ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా తయారవుతాయి. ఈవారం కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడుగా ఉంటుంది. మీరు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడినప్పటికీ కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవడం లో మాత్రం విఫలమవుతారు.

విద్యార్థులు విద్యారంగంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే ఈ వారం ద్వితీయార్థంలో వ్యాపార లావాదేవీలను విస్తరించడమే కాకుండా, మంచి లాభాలను పొందుతారు. ఈ వారం రెండవ భాగంలో కొంత పెద్ద మొత్తంలోనే ఆర్థిక లాభాన్ని పొందుతారు. కొత్త వాహనాలు, కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఈ వారం ప్లాన్ చేసుకోవచ్చు.

మిధున రాశి జాతకులకు ఈ వారం కాస్త అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీ మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ వారం ఒత్తిడిని జయించగలుగుతారు. ఈ సమయంలో పెద్దగా అనారోగ్యాలు వచ్చే సూచనలు లేవు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ వారం బాగా కష్టపడాల్సి ఉంటుంది.

మిధున రాశి వారు కష్టపడితే తప్పకుండా ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఈవారం కాస్త ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులు డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైనా ముఖ్యమైన పత్రాలలో సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని సంతకాలు పెట్టాలి.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ప్రతికూలమైన ప్రభావం ఉంది. ఈ వారం మరింత ఓర్పుతో కర్కాటక రాశి వారు పని చేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి సరైన వ్యూహంతో వెళ్ళినప్పుడు మాత్రమే పనికిరాని ఖర్చులను నియంత్రించగలుగుతారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవారం కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. ఏదైనా వ్యాపారాన్ని ఈ వారం ప్రారంభించాలనుకుంటే దానిని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

సింహరాశి వారి జీవితం ఈవారం బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలను ఇస్తాయి. వైవాహిక జీవితం కూడా సంతోష దాయకంగా ఉంటుంది. ఈవారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈవారం మొత్తంలో సింహ రాశి వారికి బాగానే ఉంటుంది.

ఈవారం సింహరాశి విద్యార్థులు కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. ఈ వారం మీలో అభద్రత భావం మిమ్మల్ని ఇతరుల నుండి సలహా తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది మాత్రమే మిమ్మల్ని చాలా పెద్ద మరియు అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం.

కన్యా రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా లేదు. ఈ వారం మీరు చేసే పనుల తోటి విసిగి పోతారు. ఈ వారం కుటుంబ వాతావరణంలో కొన్ని మార్పులు చేసే ముందు మీరు ఇతర సభ్యుల అభిప్రాయాన్ని కూడా పొందటానికి ప్రయత్నం చేయాలి. లేదంటే కుటుంబ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకునే నిర్ణయం వారిని మీకు వ్యతిరేకంగా మార్చే అవకాశం ఉంది.

ఈ వారం మీరు పెట్టుబడుల నుండి ఆశించినంత లాభాన్ని పొందలేరు. ఈవారం విద్యారంగంలో కృషి వల్ల మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇక ఈ వారం ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్న వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కాకుంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మాత్రం బాగా కష్టపడవలసి ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+