రాశిఫలాలు: లక్ష్మీదేవిని సందర్శించాలి.. ధనం అందుతుంది
జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలను నక్షత్రాల గమనం ఆధారంగా పండితులు చెబుతుంటారు. ఈ వారం ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఇబ్బందులేమైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలి? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా చేసుకొని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:ప్రతి చిన్న పనికి ఇతరులపై ఆధారపడటం మానుకొని పట్టుదలగా పనిచేయాలి. శత్రు దోషం తొలగి శుభవార్తను వింటారు. భూమి, వాహన యోగాలున్నాయి. వ్యాపారంలో కలిసివస్తుంది. కొందరికి మేలు కలుగుతుంది మీ వల్ల. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదంగా మారుతుంది.

వృషభరాశి: ఏ పని తలపెట్టిన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలత్వం లేకుండా చూసుకోవాలి. ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. వారం మధ్యలో ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. వ్యాపారంలో విశేష లాభాలు సూచిస్తున్నాయి. విష్ణువు ఆరాధన మంచిది.
మిథునరాశి:ఇది చాలా విలువైన కాలం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి చెందుతారు. వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది. ముఖ్యమైన పనిని పట్టుదలతో పూర్తిచేస్తారు. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. మహాగణపతిని ఆరాధించడంవల్ల శుభం కలుగుతుంది.
కర్కాటక రాశి: ధర్మమార్గంలో ముందుకెళ్లాలి. పరోపకార బుద్ధితో పనిచేయడంవల్ల ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఫలితాలు బాగున్నాయి. వ్యాపారంలో నలువైపులా వ్యాపిస్తారు. సంతానానికి సంబంధించిన మంచి శుభవార్త చెవిన పడుతుంది. లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది.
సింహరాశి: ప్రధానమైన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు అసలొద్దు. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. మంచి భవిష్యత్తు కోసం చేసే పనులు ఫలిస్తాయి, వారాంతంలో శుభఫలితాలుంటాయి. ఆదిత్య హృదయం చదవాలి.
కన్యరాశి: పనులను మధ్యలో వాయిదా వేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. నిర్ణయాలు సొంతంగా తీసుకోవాలి. కొందరివల్ల మనస్తాపం కలుగుతుందికానీ మీరు తొందరపడొద్దు. అవసరాలకు సరిపడా ధనం అందుబాటులో ఉంటుంది. ఏకాగ్రతగా మనసు పెట్టి పనిని ప్రారంభించాలి. దత్తాత్రేయుడి దర్శనం శుభప్రదం.












Click it and Unblock the Notifications