weekly horoscope: ఈ వారం రాశిఫలాలు: సంపద కలిసివస్తుంది
ఈ వారం ఏ రాశి వారికి బాగుంటుంది? ఏ విధంగా కలిసొస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో వారికి సంబంధించి ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అంతా సానుకూలంగానే ఉందా? ఏదైనా ప్రతికూలత ఉందా? తదితర విషయాల్ని రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.
ఒక్కోరోజు ఒక్కో రాశివారికి కలిసివస్తుంది. కొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వారం ఏ రాశివారికి బాగుందో ముందుగానే తెలుసుకుందాం. దీనివల్ల ఏదైనా సమస్యలుంటే బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 12, 2023 వరకు వార రాశిఫలాలు ఎలా ఉన్నాయో? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

మేష రాశి: ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎవరితోను వివాదాలు వద్దు. మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఆధారపడివుంటుంది. స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవాలి. భగవంతుడు పరీక్ష పెడుతున్నాడని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది. వ్యాపారంలోనవగ్రహ శ్లోకాలు పఠించాలి.
వృషభరాశి: ఆలోచించి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును నిర్మిస్తాయి. గతంలో మొదలై అసంపూర్తిగా ఉన్న పనులన్నీ తాజాగా పూర్తవుతాయి. ఆవేశం వదిలిపెట్టండి. ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. ఇష్టదేవతను స్మరించండి. వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. ఆశయం నెరవేరుతుంది.
మిథున రాశి: నిర్ణయాలు ధర్మం తప్పకుండా తీసుకోవాలి. విజయాలన్నీ మనోబలంమీద ఆధారపడివుంటాయి. ఎక్కడా సంకోచం పనికిరాదు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. విష్ణుమూర్తిని ధ్యానించాలి.
కర్కాటక రాశి: ధన యోగాన్ని సూచిస్తోంది. తగిన అవకాశాలు వస్తాయి.. వాటిని ఉపయోగించుకోవాలి. వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగులు బాధ్యతల్ని సకాలంలో పూర్తిచేయడంతోపాటు వారికి సన్నిహితులైనవారి సూచనలు మేలు చేస్తాయి. ఒంటరిగా ఉండొద్దు. శివుణ్ని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది.
సింహరాశి: ఫలితాలు బాగుంటాయి. ఏ పనికీ తొందర పనికిరాదు. అవకాశం వచ్చేంతవరకు ఎదురుచూడాలి. ధనలాభం ఉంది. ఏ పనికైనా ముందస్తు ప్రణాళిక ముఖ్యం. అప్పుడే విజయం లభిస్తుంది. ఇష్టదేవతను ఆరాధించడంవల్ల పనులు పూర్తవుతాయి.
కన్యారాశి: ఏ పనినీ మధ్యలో ఆపొద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంద. మిమ్మల్ని పక్కదారి పట్టించేవారు ఉన్నారు.. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం లాభనష్టాలు లేకుండా ఉంటుంది. ఇష్టదేవతను ధ్యానించాలి.












Click it and Unblock the Notifications