లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తోంది.. జులై 2 నుంచి 8 వరకు రాశులవారీగా ఫలితాలు
మేషరాశి : శుభయోగాలున్నాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు మొహమాటం వదిలించుకోవాలి. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటుంటే ఆర్థికంగా కలిసివస్తుంది. ఎప్పటినుంచో ఉన్న జీవితాశయం నెరవేరుతుంది. ఏ పనిని మధ్యలో ఆపొద్దు
వృషభరాశి : వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. తీసుకునే నిర్ణయాలు విజయాన్ని కలిగిస్తాయి. భూమి, వాహన యోగాలు అనుకూలంగా ఉన్నాయి. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మంచి వార్త చెవిన పడుతుంది.

మిథున రాశి : ఈ రాశివారికి ఇది మంచి సమయం. సకాలంలో పని పూర్తిచేసి విజయాన్ని కైవసం చేసుకుంటారు. ధనయోగం సూచిస్తోంది. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. నిరంతరం కష్టపడుతుండటంవల్ల మంచి ఫలితాలు వస్తుంటాయి. బద్ధకంతో అలసత్వంగా వ్యవహరిస్తే సమస్యలు పెరుగుతాయి. ఆస్తిని అభివృద్ధి చేస్తారు. రాముడి నామాన్ని జపించాలి.
కర్కాటకరాశి : మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పని ప్రారంభించే సమయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఆర్థిక విషయాలు బాగానే ఉన్నాయి. ఉద్యోగంలోకానీ, వ్యాపారంలోకానీ పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కుటుంబ సభ్యులను సంప్రదించడం ఉత్తమం. గొడవలు జరిగే అవకాశం ఉంది. తక్కువగా మాట్లాడటం మంచిది. నవగ్రహాల శ్లోకాలు పఠించాలి.
సింహరాశి : చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ధర్మమార్గంలో ముందుకు పయనించాలి. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. సమస్యలెదురైనప్పటికీ వాటికి వెంటనే పరిష్కారం లభిస్తుంది. విశేషమైన ధనలాభం కనపడుతోంది. ఖర్చులు పెరుగుతాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. శుక్ర గ్రహ శ్లోకం పఠించాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కన్యారాశి : ఉన్నతమై స్థానం కనపడుతోంది. ఏ పనినైనా సకాలంలో ప్రారంభించాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ధర్మమార్గంలో పయనిస్తూ విజయాలు సాధిస్తారు. లక్ష్మీకటాక్ష సిద్ధి బాగుంది. చేసే పనులను మంచి భవిష్యత్తు కోసం ఉపయోగిస్తారు. ఆవేశం తగ్గించుకోవాలి. సంతానానికి సంబంధించిన వార్తలు వింటారు. దుర్గాదేవిని ధ్యానించాలి.












Click it and Unblock the Notifications