weekly horoscope: తులారాశి నుండి మీనరాశి వరకు ఫలితాలు.. వీరికి ఆర్ధిక నష్టం!!
ఫిబ్రవరి 4 నుండి 10వ తేదీవరకు ఈ వారంలో రెండు ముఖ్యమైన గ్రహాల సంచారం రాశి చక్ర జాతకులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తే, మరికొందరికి ఈ వారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మరి ఈ వారం తులారాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశుల ఫలితాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
తులారాశి: తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారు ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. ఈ సమయంలో తులా రాశి వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. ఈవారం తులారాశి వారికి ముఖ్య గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శనీశ్వరుని అనుగ్రహం మినహాయించి మిగతా అన్ని గ్రహాల అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఈవారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్లో కచ్చితంగా ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విశేష ఫలితాలు ఉంటాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న వారికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ వారం అనవసరమైన పరిచయాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఈ వారం కొన్ని గ్రహాల అనుకూల పరిస్థితుల నేపథ్యంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశాలకు వెళ్లాలని చూస్తున్నవారు శుభవార్తలు పొందే అవకాశం ఉంది. ఈ వారంలో కెరీర్లో మెరుగ్గా రాణిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. ధనస్సు రాశి జాతకులు ఈ సమయంలో దైవ కార్యాలలో పాల్గొంటారు.
మకర రాశి: ఈ వారం మకర రాశి వారికి అనేక అనుకూలతలు కనిపిస్తున్నాయి. మకర రాశి వారు శని గ్రహబలం వలన ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఈవారం ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. ఈవారం నిపుణులకు చాలా మంచిది. కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈవారం వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సామాజికంగా గుర్తింపు కూడా లభిస్తుంది.
కుంభరాశి: కుంభ రాశి జాతకులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఈవారం కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ వ్యవహారాల విషయంలో కుంభ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పిల్లల వల్ల సమస్యలు ఎదురు కావచ్చు. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఈవారం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అయితే ఈ వారం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీన రాశి వారు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగతంగానూ, కుటుంబ పరంగాను మీనరాశి జాతకులు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలలో ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications