వ్యాపారంలో అద్భుత యోగం ఉంది.. ఈ రాశులు కుబేరులే
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలో నిర్ధేశిత సమయంలో ప్రయాణిస్తుంటాయి. ఇలా ప్రయాణించడంవల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎలా కలిసివస్తుంది? ప్రతికూలత ఉంటే వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలుంటాయి? అనే విషయాలను తెలుసుకుందాం.
మేషరాశి
ప్రతి విషయాన్ని చాలా క్షుణ్నంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే కాలం వ్యతిరేకంగా ఉంది. చెడు ఆలోచనలు రానీయవద్దు. దేనికీ తొందరపడొద్దు. అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. చంచల నిర్ణయాలు వ్యాపారంలో మేలు చేయవు. విష్ణు సహస్రనామం చదువుకోండి మేలు కలుగుతుంది.

వృషభరాశి
శుభయోగాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దీనివల్ల బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. ధనలాభం సూచితం. భూమి, వాహన యోగాలున్నాయి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మిథునరాశి
బాధ్యతలను ధైర్యంగా నిర్వర్తించాలి. ధర్మదేవత అనుగ్రహం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల శుభం కలుగుతుంది.
కర్కాటక రాశి
వ్యాపారంలో క్రమక్రమంగా అభివృద్ధి సాధిస్తారు. మనోబలంతో పనిచేయాలి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఆపద నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండి ఇష్టదేవతను ధ్యానించడంవల్ల శక్తి సమకూరుతుంది.
సింహరాశి
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. లాభాలున్నాయి. ఉద్యోగంలో కోరుకున్నది సాధిస్తారు. భూమికి సంబంధించి లాభం ఉంది. ఎదుటివ్యక్తులతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. వ్యాపారంలో సమస్యలున్నాయి.. ఇష్టదేవతను ఆరాధించడంవల్ల ఆనందం కలుగుతుంది.
కన్యారాశి
వ్యాపార యోగం అద్భుతంగా ఉంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అంతా ఊహించినట్లుగానే జరుగుతుంది. ఉద్యోగంలో కొత్త విషయాలు నేర్చుకోవాలి. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారున్నారు. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల కార్యసిద్ధి కలుగుతుంది.












Click it and Unblock the Notifications