weekly horoscope: ఈ వారం తులారాశి నుండి మీనరాశి వరకు.. అనుకూలతలు తెలుసుకోండి!!
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ వారంలో రెండు ముఖ్యమైన గ్రహాల సంచారం రాశి చక్ర జాతకుల పై ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తే, మరికొందరికి ఈ వారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మరి ఈ వారం తులారాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశులకు ఉండే మంచి అనుకూలతలను ప్రస్తుతం తెలుసుకుందాం.
తులా రాశి వారికి ఈ వారం కొద్దిగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులా రాశి వారు ఈ వారం ఓపికతో వ్యవహరిస్తే అనేక సమస్యల నుండి బయట పడడానికి అవకాశం ఉంటుంది. ఈవారం తులా రాశి వారికి దాదాపు అన్ని విషయాలలో కష్టంగా ఉన్నప్పటికీ ఆచితూచి సమస్యల నుండి బయటపడి విజయం సాధించే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ వారం బాగా దోహదం చేస్తుంది. కెరీర్లో కచ్చితంగా ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇతరుల సహాయం లేకుండానే మీరు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ వారంలో విశేష ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి.
ధనుస్సు రాశి వారికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని చూస్తున్నవారు శుభవార్తలు పొందే అవకాశం ఉంది. ఈ వారంలో కెరీర్లో మెరుగ్గా రాణిస్తారు. ఈ వారం మీలో సృజనాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం క్రీడలు వంటి కార్యక్రమాలలో పాల్గొంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఈ వారం మకర రాశి వారికి అనేక అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి సురక్షితమైన ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయడం ఈ సమయంలో మంచిదని సూచించబడింది. ఈవారం నిపుణులకు చాలా మంచిది. మకర రాశి జాతకులు గొప్ప పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇది మీకు భవిష్యత్తుకు చాలా సహాయం చేస్తుంది.
కుంభరాశి జాతకులకు ఈవారం వారి తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. దీనివల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. ఆశించిన ఫలితాలను పొందడానికి మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. విషయాలను అర్థం చేసుకొని వినయ, విధేయతలతో ఇతరులతో మాట్లాడినప్పుడు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
మీనరాశి జాతకులకు ఈవారం ప్రారంభంలో ఆర్థిక పరమైన అంశాల విషయంలో కొంత అనుకూలంగా ఉండవచ్చు. విద్యారంగంలో ఈ రాశి వారికి అఖండ విజయాలు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications