కలలో బ్రతికి ఉన్నవాళ్ళు చనిపోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?
కలలు భవిష్యత్తు సంకేతాలను చెబుతాయి అని చెబుతారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో వచ్చే అనేక సంఘటనలు, మన జీవితంలో జరగబోయే విషయాలను వ్యక్తం చేస్తాయని చెబుతూ ఉంటారు. ప్రతి కలకు స్వప్న శాస్త్రంలో ఒక అర్థం తప్పనిసరిగా ఉంటుంది. అయితే కలలు ఎవరైనా చనిపోయినట్టు వస్తే మంచిదా? కాదా? బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టు కలలో వస్తే అసలు ఏం జరుగుతుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కలలో మరణాలు, మృతదేహాలు
కలలో మరణం రావడం చాలా సహజం. దాదాపు ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో మరణానికి సంబంధించి కల తప్పనిసరిగా వస్తుంది. ఆ కల వారిని ఆవేదనకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యులో, దగ్గరి బంధువులో చనిపోవటం కలలో అయినా సరే చాలా బాధను కలిగిస్తుంది. కలలో చనిపోయినట్టుగా చూడడం సహజంగా మన మనసుకు కీడే అనిపించినప్పటికీ అది శుభపరిణామం అని డ్రీమ్ సైన్స్ చెబుతుంది.

బ్రతికున్న వాళ్ళు చనిపోయినట్టు కల వస్తే జరిగేదిదే
దీని అర్థం ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయని ఈ కల ద్వారా సూచన చేసినట్లు చెబుతారు. బ్రతికి ఉన్న వాళ్ళు చనిపోయినట్టు వచ్చే కల మీ జీవితంలో అసహ్యకరమైన విషయాలు ముగియబోతున్నాయి అని చెప్పే సంకేతంగా చెబుతారు. కలలో చనిపోయినట్టు చూడడం ప్రతికూల విషయాలు ముగిసి జీవితంలో సానుకూలత రాబోతుందని చెప్పే సంకేతంగా చెబుతారు. కలలో మీరే మరణించినట్టుగా చూస్తే మీ ఆయుష్షు పెరుగుతుందని అర్థం.
కలలో కుటుంబసభ్యుల మరణం.. ఏం జరుగుతుందంటే
కలలో మీ కుటుంబ సభ్యుల మరణాన్ని చూస్తే, ఇది వారి వయసును పెంచుతుంది అన్న అర్థం లేదా ఏదైనా కొత్త, శుభ ప్రారంభం వారి జీవితంలో కాబోతుంది అని అర్థం. ఇలాంటి కలలు మీ కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తాయి అని అర్ధం. కనుక కలలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మరణించినట్లుగా చూస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇది మీకు భవిష్యత్ లో జరిగే మంచిని సూచిస్తుంది కనుక భయపడాల్సిన అవసరం లేదు.












Click it and Unblock the Notifications