‘భూరీ విరాళం’ అంటే ఏమిటి?
భారీ విరాళం అనే పదాన్ని చాలా తరచుగా వింటూ ఉంటాం. కానీ, భూరీ విరాళం అనే పదాన్ని కొన్ని సందర్భాల్లోనే వాడుతున్నారు. అసలు ఈ భూరీ విరాళం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూరీ విరాళం" అంటే పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం అనే అర్థం వస్తుంది.
భూరీ విరాళం తరచుగా డబ్బుకు సంబంధించినది, కానీ వస్తువులు లేదా సేవలు కూడా కావచ్చు. ఈ పదం సాధారణంగా దాతృత్వ సంస్థలకు, సామాజిక కార్యక్రమాలకు లేదా విపత్తు సహాయక చర్యలకు పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడాన్ని సూచిస్తుంది.

ఇక్కడ కొన్ని ఉదాహరణలు గమనించినట్లయితే.. ఒక వ్యాపారవేత్త ఒక ఆసుపత్రికి భూరి విరాళం ఇచ్చారు. ఒక ధనవంతుడు విద్యా సంస్థకు భూరి విరాళం అందించాడు. ఒక స్వచ్ఛంద సంస్థ వరద బాధితులకు భూరి విరాళం సేకరించింది. ఇలాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాయి.
ప్రముఖ దేవాలయాలకు కూడా సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద మొత్తంలో విరాళం అందించినట్లయితే.. వారు భూరీ విరాళం అందజేశారని చెబుతుంటారు. "భూరీ విరాళం" అనే పదం పెద్ద మొత్తంలో డబ్బును గానీ, స్థిర, చర ఆస్తులను కానీ.. దానం చేయడాన్ని సూచిస్తుంది. ఇది దాత ఉదారతను, సమాజం పట్ల వారి నిబద్ధతను సూచిస్తుంది.












Click it and Unblock the Notifications