వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంకటహర చతుర్థి అంటే ఏంటి..? పూజా విధానం ఎలా ఉంటుంది..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే

సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి ‬వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చతుర్థి.. శ్రావణ మాసంలో రేపు వచ్చే ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం అంటే మహిళలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పూజలు, నోములు, శుభకార్యాలతో సందడి చేస్తారు. దీనికి తోడు ఎంతో పవిత్రమైనదిగా భావించే సంకటహర చతుర్ధి దీంతో భక్తులంతా ఈ పూజకు సిద్ధమవుతున్నారు.

What is sankatahara Chaturthi, what is the pooja procedure

మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి ‬వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిధి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి.. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ప్రతిమాసం కృష్ణ పక్షంలో.. అంటే పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు ( సూర్యాస్తమయ సమయంలో ) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి. అందులోనూ శ్రావాణ మాసంలో చతుర్ధి అంటే మరింత ప్రాముఖ్యం ఉంటుంది..

సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం:- సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.

సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదువుతారు. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేద 11 లేద 21 ప్రదక్షిణాలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.

English summary
Sankatahara Chaturthi is thescripture that heals people from suffering
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X