వాస్తు ప్రకారం చెప్పులు ఇంటి బయట ఎక్కడ విడవాలి?
మన సనాతన భారతీయ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి అంతులేని ప్రాముఖ్యత ఉంది. దీని ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే ఇంటి గుమ్మం బయట చెప్పులు ఎక్కడ విడవాలి? చెప్పుల స్టాండ్ అమరిక ఎలా ఉండాలి? ఏ దిశలో అయితే బాగుంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెప్పులు విడిచే స్టాండ్ ఇంట్లోకి ప్రతికూల శక్తిని వ్యాపింపచేస్తుంది. అందుకే ఇంటి బయటే వదులుతాం. అయితే బయట చెప్పులు విడిచే సమయంలో ఆగ్నేయం, ఈశాన్యం, ఉత్తరం, తూర్పు వైపు అసలు విడవకూడదు. చాలామంది బయట నుంచి వస్తూ ఇంటి లోపలికి చెప్పులు కూడా వేసుకొని వచ్చేస్తుంటారు. అలా చేయడంవల్ల దరిద్రాన్ని కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

పశ్చిమ, వాయువ్య దిశల్లోనే విడవాలి. లేదంటే దరిద్రం ఇంట్లోకి వస్తుంది. కలహాలు రేకెత్తుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింటుంది.
ఇంట్లో చాలామంది చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు. దీనివల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. అన్నీ బయటే ఉండాలి. ఈ రోజుల్లో ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం అనేది ఫ్యాషన్ అయింది. నేలమీద నడిస్తేనే కాళ్లకు రక్తప్రసరణ జరుగుతుంది.
చెప్పుల స్టాండ్ వంటగదికి, దేవుడి గదికి దగ్గరలో ఉండకూడదు. కొంతమంది తెలియక వంటగదికి దగ్గరలో ఉంచుకుంటారు. లేదంటే వంటగది గుమ్మం బయట చెప్పుల స్టాండ్ పెడతారు. అది సరికాదు.
బాల్కనీలో స్టాండ్ పెట్టుకోవచ్చు. వాయువ్యం, దిక్షణ దిక్కులు చూసుకోవాలి. అక్కడ విలువైన వస్తువులు ఉండకూడదు. ఒకవేళ అక్కడ విలువైన వస్తువులుంటే తీసేయాలి. లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.. నష్టపోతారు.
మన పాదాలతో శనికి అనుబంధం ఉంటుంది. వేరేవారివి, పాతవి, చిరిగిపోయినవి, తెగిపోయినవి వేసుకోకూడదు. బయట కూడా ఉంచకూడదు.ఇవి వేసుకుంటే శనికి కోపం. విడిచేటప్పుడు చెప్పులు, బూట్లు బోర్లాగా ఉండకూడదు.వీటి వల్ల లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది. వీటిని బయట పడేయం ఉత్తమం.












Click it and Unblock the Notifications