ధనలక్ష్మీ యోగంతో ఈ వారం ఈ రాశులవారి పంట పండుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా గురువు, శుక్రుడు స్థానాల మార్పు, చంద్రుడు, కుజుడు మధ్య సంబంధాల కారణంగా ధనలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ ధనలక్ష్మీ యోగం కారణంగా వివిధ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ఈ వారం ధనలక్ష్మి యోగంతో లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కన్యారాశి
ధనలక్ష్మీ యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి వారు ఏ పని చేసిన ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో కెరీర్ కు, వ్యాపారానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణం ఊహించని దానికంటే ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితులు, శ్రేయోభిలాషుల సహాయంతో కెరీర్ లో ముందుకు వెళతారు. కన్యారాశి వారు ఆరోగ్యంపైన, ఆహారంపైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

తులారాశి
తులారాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం అంతా తులా రాశి వారు అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రత్యర్థులను ఓడిస్తారు. కోర్టు సంబంధిత కేసులు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఈ వారం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో పనిచేసే వారి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.
మకర రాశి
మకరరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్నేహితులు శ్రేయోభిలాషుల పూర్తి సహకారం ఈ సమయంలో ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వస్తాయి. మార్కెట్లో ఉన్న డబ్బు అకస్మాత్తుగా బయటకు వస్తుంది. మీ విశ్వసనీయత పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. మీరు చేసే పనికి గౌరవం లభిస్తుంది.వారం చివరలో కుటుంబ సభ్యుల నుంచి మద్దతును పొందుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఏదైనా ప్రధాన నిర్ణయాలను తీసుకునేటప్పుడు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే మంచిది. పూర్వీకుల ఆస్తులు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. భూములు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలను విస్మరిస్తే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications