మహాలక్ష్మి రాజయోగంతో వీరు మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది!
గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాలు సంచారం చేస్తున్న సమయంలో వివిధ రాశులను, ఇతర గ్రహాలతో సంయోగం చెంది కొన్ని శుభ యోగాలను కొన్ని శుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఇక ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై అక్టోబరు 21వ తేదీ సాయంత్రం 54 నిమిషాల వరకు ఉంటుంది.
కుజ, చంద్రుల సంయోగంతో ఈ మహాలక్ష్మి రాజయోగం
దీపావళి పండుగ నాడు చంద్రుడు తులా రాశిలో సంచరించనున్నాడు. ఇక అప్పటికే తులా రాశిలో కుజ సంచారం జరగడం వల్ల ఈ రెండు గ్రహాల సంయోగంతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. 18 సంవత్సరాల తర్వాత కుజ చంద్రుల సంయోగంతో ఏర్పడుతున్న ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు మహాలక్ష్మి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి జాతకులు చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సంతోషంగా జీవిస్తారు. నూతన వాహనాలను, స్థిర ,చర ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయం వీరికి మంచి సమయం.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు మహాలక్ష్మి రాజయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి రాజయోగం కారణంగా వృషభ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుండి మద్దతు దొరుకుతుంది.
కన్యారాశి
మహాలక్ష్మి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు అనేక విధాలుగా కలిసివస్తుంది. కన్యారాశి జాతకులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు.
వృశ్చిక రాశి
మహాలక్ష్మి రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications