మాలవ్య మహాపురుష రాజయోగంతో వీరికి మహారాజ యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి. విలాసాలకు, సంపదలకు అధిపతి అయిన శుక్రుడు నవంబర్ మాసంలో మాలవ్య మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. శుక్రుడు ఏర్పరిచే మాలవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్ట రాబోతుంది. మాలవ్య మహాపురుష రాజయోగం పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

మాలవ్య మహాపురుష రాజయోగం
ఈ మాలవ్య మహా పురుష రాజయోగం శుక్రుడు ఒక కేంద్ర గ్రహంలో ఒకటవ, నాలుగవ, ఏడవ లేదా దాని సొంత రాశిలో, లేదా ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఈ మాలవ్య మహా పురుష రాజయోగం తో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

With malavya mahapurush RajYoga these zodiac signs will get Maharaja Yoga

ధనస్సు రాశి
మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా ధనుస్సురాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సురాశి జాతకులు ఏ పని చేసిన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం బాగుంటుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. శుక్రుడు ఈ రాశిలో 11వ ఇంట్లో సంచరించడం వల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది మంచి సమయం. పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు.

మకర రాశి
మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా మకర రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ రాశిలో మాలవ్య మహా పురుష రాజయోగం పదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. మీ పనితీరు ప్రశంసించబడుతుంది. వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆకస్మిక ఆర్థిక లాభాలను అనుభవిస్తారు.

తులారాశి
మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా తులా రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ రాజయోగం తులా రాశి వారికి లగ్న గృహంలో ఏర్పడడం వల్ల ఈ సమయంలో వీరి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టమైన వారితో సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారాల నుంచి ప్రయోజనాలు పొందుతారు.

Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+