దీపావళి తర్వాత దరిద్రం పట్టుకున్న రాశులివే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు యువరాజు ఆయన బుధుడు నేడు మధ్యాహ్నం 12.39గంటలకు తులారాశి నుంచి వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు వ్యాపారానికి, మేధస్సుకు, కమ్యూనికేషన్ కు ప్రతీకగా చెబుతారు. అటువంటి బుధుడు కుజుడు అధిపతిగా ఉండే తులారాశిలో సంచారం చేయనున్నాడు. బుధ సంచారం కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. తులారాశిలో బుధ సంచారం కారణంగా అశుభ ఫలితాలను ఎదుర్కొనే ఆ రాశుల వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
దీపావళి తర్వాత వృశ్చిక రాశిలో బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభ రాశిలో సప్తమ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నందున మీరు ఏ పని చేపట్టినా పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆశించిన లాభాలు రావు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అపార్ధాలు కూడా ఏర్పడతాయి.

కన్యారాశి
కన్య రాశిలో బుధుడు మూడో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల కన్యారాశి జాతకులు ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కన్యారాశి వారు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు పెరిగి చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది . పనిచేసే చోట ఉద్యోగులు కూడా తీవ్ర నిరసన ఎదుర్కొంటారు.కన్యా రాశి జాతకులకు వ్యాపారాలలో మందగమనం కనిపిస్తుంది.
తులారాశి
తులా రాశిలో బుధుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. కుటుంబ జీవితం సమస్యలమయంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బుధుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు వస్తాయి. కుటుంబ జీవితం మానసికంగా ప్రశాంతతను ఇవ్వదు. నిరాశ నిస్పృహలతో జీవించాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోదు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇబ్బందులు వస్తాయి. పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications