త్వరలో శని కన్నెర్ర.. ఈ రాశులవారికి చుక్కలే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కర్మలకు అధిపతి అయిన శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని దేవుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తాడు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో శని దేవుడు ఆ రాశిలో వివిధ దశలకు లోనవుతాడు. అయితే ఫిబ్రవరి 27వ తేదీన శని కుంభరాశిలో అస్తమిస్తున్నాడు.
కుంభరాశిలో శని అస్తమయం
కుంభ రాశిలో శని అస్తమయం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను, మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది. కుంభరాశిలో శని అస్తమయం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే, బాగా కష్టపడాల్సి వచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
శని అస్తమయం మిధునరాశిలో తొమ్మిదవ గృహంలో జరుగుతుంది. కాబట్టి మిధునరాశి వారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి . అనేక అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శని అస్తమయం నుండి మిధున రాశి వారు పనిలో తీవ్రమైన అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
శని అస్తమయం సింహరాశిలో ఏడవ గృహంలో జరుగుతుంది. దీని కారణంగా సింహరాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఆఫీసులో పనిచేసే వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలు ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతోనూ, సహ ఉద్యోగులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి
శని అస్తమయం తులారాశిలో ఐదవ గృహంలో జరుగుతుంది. దీనివల్ల తులారాశి వారు వివిధ సమస్యల కారణంగా పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. తమ పిల్లల ఆరోగ్యం గురించి చదువు గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సి వస్తుంది. ఈ సమయంలో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులు తమ చదువులలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమలో ఉన్న వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications