కుబేరుడికి ఇష్టమైన ఈ రాశులవారు ఎప్పుడూ కుబేరులే!!

హిందూ శాస్త్రాల ప్రకారం సంపదలకు అధి దేవుడు అయిన కుబేరుడికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఆ వ్యక్తులు అపార సంపదలతో తులతూగుతారు. వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సిరిసంపదలతో వారు సుఖంగా జీవిస్తారు. అయితే కుబేరుడు అనుగ్రహం పొందడానికి, ఆయనను మెప్పించాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై మాత్రం కుబేరుడి దయ ప్రత్యేకంగా ఉంటుంది.

కుబేరుడి దయ ఉండే ఐదు రాశులు
ద్వాదశ రాశులలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిని పాలిస్తుంది. రాశులను పాలించే గ్రహం బట్టి, ఆయా రాశులను అనుగ్రహించే దేవుళ్ళు కూడా ఉంటారు. అలా కుబేరుడు కూడా కొన్ని రాశుల వారిని ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడు. కుబేరుడికి ఇష్టమైన ఐదు రాశులు ఎప్పుడు సిరిసంపదలతో తులతూగుతూ ఉంటాయి . మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

With special grace of Kubera These zodiac signs are always lives with wealth

వృషభ రాశి
కుబేరుడి ఆశీస్సులు వృషభరాశి జాతకులపై పుష్కలంగా ఉంటాయి. వృషభరాశికి శుక్రుడు అధిపతి కాగా, సంపదకు శుక్రుడిని ప్రతీకగా భావిస్తారు. శుక్ర గ్రహం ఆర్థిక సమృద్ధికి, లగ్జరీ లకు ప్రతీకగా ఉండే గ్రహం. ఇక శుక్రగ్రహం పాలించే వృషభరాశి జాతకులపైన కుబేరుడి ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి. కుబేరుడి ఆశీస్సులతో మీరు ఏ పని చేపట్టినా కచ్చితంగా పూర్తవుతుంది. కుటుంబంతో సుఖసంతోషాలతో గడిపే రోజులు వస్తాయి. కుబేరుడి అనుగ్రహంతో సంపద మెండుగా ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటకరాశి జాతకులపై కుబేరుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. చంద్రుడు కర్కాటకరాశిని పాలిస్తాడు. చల్లని స్నేహపూర్వకమైన మనసును కలిగిన చంద్రుడు కర్కాటకరాశిని పాలించడం వల్ల కర్కాటకరాశి జాతకులకు కష్టపడి పనిచేసే స్వభావంతో పాటు, అనుకున్నవి సాధించే లక్షణం కూడా ఉంటుంది. ఇక కర్కాటక రాశి జాతకులపై కుబేరుడి దయవల్ల వారి జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఉండే జ్ఞానం, తెలివితేటల వల్ల అనేక విజయాలను సాధిస్తారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులపై కుబేరుడి దయ పుష్కలంగా ఉంటుంది. ధనస్సు రాశికి బృహస్పతి అధిపతి. బృహస్పతి తెలివితేటలకు, జ్ఞానానికి సంబంధించిన గ్రహం. ధనుస్సు రాశి జాతకులు ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కుబేరుడి ఆశీస్సులు ఉంటాయి. వీరు ఎప్పుడు అదృష్టవంతులుగా ఉంటారు. సంపదలతో తులతూగుతారు.

తులారాశి
కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం తులా రాశి జాతకుల పైన కూడా ఉంటుంది. తులారాశి వారికి కూడా శుక్రుడు అధిపతి. శుక్రుడు మరియు కుబేరుడి ప్రభావంతో తులా రాశి జాతకులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. వీరు కష్టపడి పని చేయడం ద్వారా ఫలితాలను సాధిస్తారు. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బు సంబంధించిన సమస్యలు ఉండవు. వీరు దానధర్మాలు చేస్తారు.

వృశ్చిక రాశి
వృశ్చికరాశి జాతకుల జీవితం కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల బాగుంటుంది. వృశ్చికరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంతో వీరు ధైర్యవంతులుగా, పని పట్ల ఎక్కువ శ్రద్ద ఉన్న వారుగా ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్నా విజయం సాధించేవరకు విపరీతంగా శ్రమిస్తారు. వీరిపైన కూడా కుబేరుడి దయ ఉండటంవల్ల వీరికి కూడా డబ్బు సమస్యలు ఉండవు. వీరు జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడానికి కష్టపడతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+