365 రోజులూ సంపదలు.. వీరిపై ప్రత్యేక ప్రేమ కురిపించే రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహం, కీడు గ్రహం గా భావించే రాహు గ్రహం ప్రభావం జాతకాల పైన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. రాహు గ్రహం జాతకంలో నీచ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తుల శ్రేయస్సు, సంపదపైన రాహు గ్రహం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే రాహువు శుభస్థానంలో ఉంటే కూడా అదే విధంగా మంచి గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి.
రాహువుకి ఇష్టమైన రాశులు
రాహువు కారణంగా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఒక్కో గ్రహానికి కొన్ని రాశుల పట్ల ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. అలాగే రాహువుకి కూడా కొన్ని రాశుల పట్ల ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. రాహువు ఆ రాశుల వారిని ఎల్లప్పుడూ కటాక్షిస్తాడు. మరి రాహువుకు ఇష్టమైన ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం

సింహరాశి
రాహు గ్రహానికి అత్యంత ప్రీతికరమైన రాశులలో సింహరాశి ఒకటి. సింహరాశి జాతకుల పైన రాహువు ఎప్పుడు తన అనుగ్రహాన్ని ఉంచుతాడు. రాహువు సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అన్ని రాశుల కంటే ఎక్కువ మేలును సింహ రాశి వారికి కలిగిస్తాడు. రాహువు అనుగ్రహం ఉంటే విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
365 రోజులూ శుభాలే
రాహువు కారణంగా ఎటువంటి ఇబ్బందులు అయినా పరిష్కారమవుతాయి. సింహరాశి జాతకులు ఈ సమయంలో శత్రువుల పైన కూడా విజయం సాధిస్తారు. సింహరాశి వారి జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే సంపన్న యోగం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 365 రోజులూ రాహువు వీరికి శుభాలనే ఇస్తాడు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి రాహువు యొక్క సంపూర్ణ కటాక్షం ఉంటుంది. ఈ రాశి వారి పైన రాహువు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని చూపిస్తాడు. వర్తక వ్యాపారాలు చేసేవారు రాహువు అనుగ్రహం కారణంగా లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ సమయంలో ప్రశాంతంగా జీవిస్తారు. ఎంతోకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమై ఉద్యోగాలలో ను పురోగతి కనిపిస్తుంది.
ఊహించని శుభవార్తలు
నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. రాహువు యొక్క అనుగ్రహం కారణంగా ఏ పని చేసిన అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఇక జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సమాజంలోనూ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాహువు దయతో జాతకంలో రాహు సంచార సమయంలో ఊహించని శుభవార్తలు వింటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications