18ఏళ్ళ తర్వాత మార్చిలో మీనరాశిలో సూర్య కేతువుల కలయిక.. లక్కంటే వీరిదే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రభావవంతమైన గ్రహంగా గుర్తించబడ్డాడు. అటువంటి సూర్యుడు నీడ గ్రహం, చెడు చేసే గ్రహమైన కేతువుతో కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. మార్చి నెలలో 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే సింహరాశిలో ఉన్న కేతువుతో ఈ సమయంలో సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
సూర్య, కేతువుల సంసప్తక యోగం
రెండు రాశులు ఒకదానికొకటి ఏడవ ఇంట్లో 180 డిగ్రీలలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 18 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగం కారణంగా లబ్ధిని పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాము.

వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి సూర్య కేతువుల కలయిక కారణంగా ఏర్పడే సంసప్తకయోగం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు కెరీర్లో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులు తమ కృషి తో పాటు, వ్యూహాత్మక ప్రణాళికల ద్వారా విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. వృశ్చికరాశి వారికి పదోన్నతులకు, ఇంక్రిమెంట్ లకు అవకాశం ఉంది. వ్యూహాలు భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీస్తాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రేరణ పొందుతారు.
కుంభరాశి
కుంభరాశి జాతకులకు సూర్య కేతువుల సంసప్తక యోగం కారణంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో కుంభరాశి జాతకులు సరైన నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగుతారు. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి కొనసాగిస్తారు. కుంభరాశిలో సూర్యుడు రెండవ ఇంట్లో ఉండడంవల్ల ఈ రాశిలో జన్మించిన వారికి కొత్త స్నేహితులను సంపాదించుకునే అవకాశం ఉంది. కుంభరాశి వారు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
తులా రాశి
తులారాశి జాతకులకు సంసప్తక యోగం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అనవసరమైన ఖర్చుల నుండి ఈ సమయంలో బయటపడతారు. ఈ సమయంలో వీరి కోరికలు నెరవేరుతాయి. కెరీర్ పరంగా విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పోటీదారులకు గట్టి పోటీ ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు.












Click it and Unblock the Notifications