త్రివేణి యోగంతో నేటినుండి ఈ రాశులవారి పంట పండుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అత్యంత అరుదైన త్రివేణి యోగం ఏర్పడుతుంది. నేడు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇక ఇదే సమయంలో ఈ రోజు ద్వాదశ రాశుల పైన పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాల ప్రభావం కనిపిస్తుంది. ఇక ఇదే సమయంలో నేడు త్రివేణి యోగం ఏర్పడుతుంది.
త్రివేణి యోగం.. అదృష్ట రాశులు
మరోవైపు ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి కుజుడు మరియు శివుడి యొక్క ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఇక జ్యోతిష శాస్త్రంలో నేటి గ్రహ సంచారాల కారణంగా ఏర్పడుతున్న త్రివేణి యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి త్రివేణి యోగం తో శుభ సమయం ప్రారంభమైంది. జీవితంలో ఉన్న సమస్యలు తండ్రి సహాయంతో ఇప్పుడు పరిష్కారం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈరోజు వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. బిజినెస్ లో మీ తెలివితేటలు, విచక్షణ తోనే నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి
త్రివేణి యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి సలహాతో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు వస్తాయి. విద్యార్థులు చదువులో పట్టుదలతో కృషి చేస్తే ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు నేటి నుంచి అదృష్ట జాతకులు అవుతున్నారు.
మకర రాశి
త్రివేణి యోగం కారణంగా మకర రాశి వారి జీవితం బాగుంటుంది. ఈ సమయంలో మకర రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మకర రాశి వారు ఈ సమయంలో మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మకర రాశి వారికి శుభ సమయం.
కుంభ రాశి
కుంభ రాశి వారు తాము చేసే పనులలో విజయాలను సాధిస్తారు. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. కుంభ రాశి వారు ఈ సమయంలో ఏ పనులు చేసిన విజయవంతం అవుతాయి. ఉద్యోగులు పై అధికారులతో వివాదాలు, విభేదాలు లేకుండా ఉంటే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications