రెండు రాజయోగాలతో జులైలో ఈ రాశులవారి పంట పండుతుంది
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా ఏర్పడే యోగాలు అనేక శుభ అశుభ ఫలితాలను ఇస్తాయి. ఇక ఈ నెలలో 16 జులై 2024న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. . కర్కాటక రాశిలో శుక్రుడు మరియు బుధుడు ఉంటారు కాబట్టి కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక ఉంటుంది. కర్కాటక రాశిలోని మూడు గ్రహాల కలయిక స్థానికులకు శుభ యోగాలను సృష్టిస్తుంది.
బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగాలు
సూర్యుడు మరియు బుధుడు కలయిక బుధాదిత్య యోగాన్ని ఏర్పరిస్తే అలాగే సూర్య, శుక్రుల కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ రెండు రాజయోగాలు చాలా శుభప్రదమైనవి . ఈ రెండు రాజయోగాల కారణంగా కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ శుభ యోగాల కారణంగా వారికి కలిసొస్తుంది.

కర్కాటక రాశి
జులై 2024లో బుధాదిత్య మరియు శుక్రాదిత్య యోగం కర్కాటకరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. కర్కాటకరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది . ఆదాయ వనరులు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. దీనితో పాటు, మీరు సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరుస్తారు. ఇది భవిష్యత్తులో కర్కాటకరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా ఉభయ యోగాల వల్ల పెళ్ళిళ్ళు కాని కర్కాటక రాశి వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కన్యా రాశి
జులై 2024లో బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగాలు కన్యారాశి వారికి లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో కన్యారాశి వారి ఆదాయం పెరుగుతుంది. బుధాదిత్య మరియు శుక్రాదిత్య యోగం వల్ల సమాజంలో ఆదాయం, గౌరవం పెరుగుతాయి. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకు తమ రంగాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వారి అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చెయ్యొచ్చు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం.
తులారాశి
జులై 2024లో బుధాదిత్య మరియు శుక్రాదిత్య యోగాలు తులారాశి వారికి శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ సమయంలో తులారాశి జాతకులు పెండింగ్ పనులను పూర్తి చేయవచ్చు. వ్యాపారవేత్తలు అపారమైన లాభాలను పొందే అవకాశం ఉంది. వారి ఆదాయ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల తులారాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పిల్లల పురోగతి కారణంగా వారి కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఈ కాలంలో వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications