మొదలైన అద్భుతయోగం... వీరికి విలాసాలతో రాజభోగం!
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటాయి. గ్రహాలు వివిధ రాశులలోకి, నక్షత్రాలలోకి సంచారం చేస్తున్నప్పుడు వాటి స్థాన మార్పు అనేక శుభ మరియు అశుభయోగాలను ఏర్పరుస్తాయి .ఈ మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే మార్చి రెండవ తేదీన సూర్యుడు మరియు బృహస్పతి గ్రహాలు ఒకదానికొకటి 90 డిగ్రీల వద్ద పరివర్తనం చెందడం వల్ల శుభ యోగం ఏర్పడింది.
కేంద్రయోగం.. మూడు రాశులవారికి అదృష్టం
దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చింది. ముఖ్యంగా మూడు రాశుల వారు కేంద్ర యోగం కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సూర్యుడు మరియు బృహస్పతి సంయోగం కారణంగా ఏర్పడే కేంద్ర యోగంతో లబ్దిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి కేంద్ర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కెరీర్లో కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకుంటే ఆ ప్రయత్నం చేయవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారి అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి సూర్యుడు, బృహస్పతి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి సమయం. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ సమయం మిధున రాశి వారికి కెరీర్ పరంగా చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
కన్యారాశి
కన్యా రాశి వారికి సూర్యుడు బృహస్పతి కలయిక వల్ల ఏర్పడే కేంద్ర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా రాణిస్తారు. కెరీర్లో మంచి ప్రయోజనాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కేంద్ర యోగం కారణంగా కన్యారాశి వారికి అన్ని విధాలా లబ్ధి జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications