బుధ దహనంతో పులిపంజా చీల్చి వీరు కోటీశ్వరులవుతున్నారు!
2025 సంవత్సరంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 లో మేషరాశిలో బుధ దహనం కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు మేధస్సుకు, తర్కానికి కారణమైన గ్రహం. బుధుడు వివిధ జాతకుల జీవితాలలో బలంగా ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను కలుగజేస్తాడు. బలహీనంగా ఉన్నప్పుడు అశుభ ఫలితాలకు కారణమవుతాడు.
మేషరాశిలో బుధ దహనం
కుండలిలో బుధుడు శక్తివంతంగా ఉంటే ఆ వ్యక్తికి మంచి జ్ఞానం, తెలివితేటలు, మంచి శరీరం కలుగుతాయి. జీవితంలో వారు సంతృప్తిగా జీవిస్తారు. ఇక అటువంటి బుధుడు నేడు మేషరాశిలో దహనం అవుతున్నాడు. బుధుడు సూర్యునికి దగ్గరగా రావడం వల్ల దహనం అవుతున్నాడు. బుధదహనం కారణంగా బుధుడి యొక్క శక్తి కొంత బలహీనపడుతుంది.

బుధ దహనం కారణంగా లబ్ధిని పొందే రాశులు
నేడు మేషరాశిలో ఉదయం 3.53 నిమిషాలకు బుధ దహనం జరిగింది. ఈ బుధ దహనం కారణంగా కొన్ని రాశులవారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వీరు బుధుడి కారణంగా వృత్తిపరమైన అంశాలలో విజయం సాధిస్తారు. మేష రాశిలో బుధ దహనం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
మేషరాశి
బుధ దహనం కారణంగా కలిసి వస్తుంది. వీరికి ఆర్థిక విషయాలలో అదృష్టం బాగుంటుంది. వ్యాపార విషయాలలోనూ పురోగతి ఉంటుంది. బుధ దహనం మేషరాశి జాతకులకు జీవితాలలో సంతోషాన్నిస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది.
సింహరాశి
బుధ దహనం కారణంగా సింహ రాశి జాతకులకు కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులు గా మారుతున్నారు. వృత్తిపరమైన ఆర్థిక విషయాలలో వీరికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయలక్ష్మి వరిస్తుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అన్ని విధాల ఈ సమయం సింహ రాశి వారికి మంచి సమయం.
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు బుధ దహనం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి. వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు ధనుస్సు రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో వీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications