జ్యోతిషం: గ్రహాలు అనుకూలంగా లేవా?
1.శ్రీనివాస్ ఆమనగంటి, కరీంనగర్, ఉద్యోగం
మీకు 2016 వరకు గ్రహానుకూలతలు లేవు. రాహు కేతువులకు పరిహారం ఎక్కువగా చేసుకోండి. పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం మీకు చాలా అవసరం.
2.వెంకటేశ్వర్లు,ప్రకాశం,భవిష్యత్తు
ఎన్నో సార్లు చెప్పాం భవిష్యత్తులో మీరు దేనిగురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
3.శ్రీనివాస శివస్రాద్ మక్కపాటి, గుర్జాల, విదేశం
మీకు విదేశగమననానికి అవకాశం ఉంది. రాహుకేతువులకి పరిహారాలు చేసుకోండి.
4.గుగులోత్ కృష్ణ, భవిష్యత్
దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
5.శ్రీనివా, యస్. కనిగిరి, ప్రమోషన్
మీకు 8వఅధిపతి శని దశ నడుస్తుంది, చాలా సమస్యలతో కూడిన సమయం, అవకాశాలు తక్కువే కానీ ఆగస్టు తర్వాత కొంత మెరుగౌతుంది. అనిరవిలకు పరుహారాలుచేసుకొని శ్రీరాజమాతంగ్యైనమ: అనే మంత్రజపం చేస్తూండండి.
6.విధనుంజయ, కర్ణాటక, (తోర్నగల్)
ఇన్నిప్రశ్నలు ఒకే ప్రశ్నలో మరో 4ప్రశ్నలడిగితే చెప్పడం కుదరదు. నియమావళి చదవండి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

7.మనోజ్ రాం ఫణీంద్ర, కాకినాడ, విదేశ గమనం
మీరు విదేశాలకెప్పుడెళ్లేదీ అడిగారు. కానీ మీకా యోగముందోలేదో అడగలేదు. నిజానికి మీకు గ్రహానికూలత తక్కువగా ఉంది. మీరు విదేశాలకి వెళ్లదలచుకున్నది విద్యకోసమో ,విహారానికో ఐతేనో ఉంది కానీ వృత్తిపరంగా గ్రహానుకూలతలు లేవు. పుణ్యకార్యాలు చేస్తూ ప్రయత్నించండి.
8.శ్యాం పోడ(పుట్టిన చోటు రాయలేదు)
మీరు పేరాల కొద్దీ ప్రశ్నరాయకుండా చిన్నగా తెలుగులో రాయండి. వివరాలు ఇవ్వండి.
9.యం.సతీష్‌కుమార్ ముదడ్ల, విజయనగరం
పుట్టిన సమయం ఇవ్వలేదు కనుక జాతక పరిశీలన కుదరదు. కేవలం పేరునిబట్టి మీకు సమాధానం ఇస్తున్నాం. సతీష్‌కుమార్, శతభిషం, కుంభరాశి అవుతుంది. ఐతే, 8వ రాహువు, లగ్నకేతువు, దశమ శని, 6 వగురుడు మీకిది ఏ మాత్రమూ అనుకూలకాలంకాదు. కొంతకాలం ఆగాలి. మీ జాతకం చూడకుండా వ్యాపారమా ఉద్యోగమా చెప్పడం కష్టం కానీ ప్రస్తుతం వ్యాపారం కొంత కాలం వాయిదా వేయండి.
10. సునిల్‌కుమార్ కూన పునీతమ్
ఏవివరాలు లేకుండా విదేశాలకు అవకాశం ఉందీ లేనిదీ చెప్పడం కుదరదు.
11. యల్లపు సంతోష్ ఠాగూర్ రమేష్‌కుమార్, పుట్టినచోటు రాయలేదు , హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం
మీకు గోచార రాహులగ్నంలో, 7లో కేతు, 3లో శని, ప్రత్యేకించి రాహువులో కేతువు అంతర్దశ కొంత రాహు కేతువులకి ఎక్కువ పుణ్యకార్యాలు దానధర్మాలు చేస్తూండండి.ప
12. హేమంత్ అనిల్
ఖాళీ మెయిల్ పంపారు సరిచూసుకోండి. వివాహం,ఉద్యోగం గురించి అని హెడింగ్ పెట్టారు.
13. బిందుమాధవి, సౌజన్య ఉమాశంకర్‌ప్రసాద్‌ల సంతానంగురించి
ఉమాశంకర్ గారికి 5లో రాహువు ఉన్నాడు, బిందుమాధవిగారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. ఐతే ఇద్దరికి కూడా అనుకూల దశలేకపోవడం మూడవ విషయం. సంతానపరంగా అష్టకవర్గులో మంచి బలాలున్నాయి, రాహు శనులకు, పరిహారాలు చేసుకోండి.
14.వెంకటకృష్ణ, పుట్టిన చోటురాయ లేదు,కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
15.రమేష్‌పోపూరి, సత్తెన పల్లె, వివాహం
మీకు కుజదోషం 7వకుజుడున్నాడు. ప్రస్తుతం కొంత ప్రతికూల దశనడుస్తుంది. కానీ గ్రహబలాలున్నాయి. ఆగస్టు తర్వాత ప్రయత్నించండి. ఐతే కుజుడికి పరిహారలు దానాలు చేస్తూ ఉండండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications