మాకిద్దరికీ కుదురుతుందా?: జ్యోతిష్కుడి జవాబు
1.అన్నంనీడి గనాజి ` రాజోలు ` వివాహం ,విదేశం
మీకు జాతకరీత్యా 2016లో రాహువుయొక్కదశ అయొపోతుంది 2016,2017 ప్రాంతలో మీకు వివాహానుకూలతలున్నాయి, మీకు విదేశాలు వెళ్లడానికి గ్రహబలం అంత అనుకూలంగా లేదు
2.చంద్ర ` గుంటూరు ` వివాహం
మీకు వివాహానికి ప్రస్తుతం అనుకూలకాలమే ఉంది,మీరు భావించిన కాలసర్పదోషం మీవివాహానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు,2017 లో మీకు వివాహం జరుగుతుంది మీరు ప్రయత్నించండి.
3.రవి,ప్రియదర్శినిల వివాహపొంతన ` తిరుపతి
వీరిద్దరికీ వివాహపొంతన కలవలేదు.వీరికి వివాహ పొంతన కుదిరింది. అవికలిసాయో లేదో చెప్పగలం కానీ నిర్ణయం మాత్రం మీదే.

4.వెంకటేష్ ముదిరాజ్ ` నల్లగొండ ` ఉద్యోగం
మీకు ప్రభుత్వఉద్యోగానికి అవకాశం ఉంది.
5.అన్నదానం రామకృష్ణ ` ప.గో ` సంతానం
మీకు సంతానాధిపతి బలంగాలేడు,మీభార్యాభర్తల ఇద్దరిలోనూ ఆసంతానవిషయంగా ఏదోషమూలేదు.మీరు కేతు,రాహువులకు దానాలు చేసుకోండి,సుబ్రహ్మణ్యారాధన చేస్తూండండి.
6.అభిజ్ఞ మేడసాని `హైదరాబాద్ నుంచి ` విద్య
మీరు మీ పూర్తివివరాలు పంపలేదు, కానీ నక్షత్రం పంపారు. దాన్నిబట్టి మీకు గోచారంలో 4లో రాహువుండటం,విద్యలో ఆటంకాలుంటాయి ,కానీ పూర్తిగా నష్టపోరు.వచ్చేసంవ్సరం పూర్తిగా బాగవుతుంది.
7.రామకృష్ణ శెట్టి ` వ్యాపారంలో అప్పులు
కనీసం నక్షత్రమైనా పంపండి పుట్టిన వివరాలైనా పంపండి ,లేకపోతే చెప్పడం కష్టం
8.మనస్విని గిరీష్ మీరు పుట్టిన వివరాలివ్వకుండా ఇన్నిప్రశ్నలడిగితే చెప్పడం ఎలా దయచేసి నియమావళి చదివి పంపండి.
9.అనసూయ విశ్వనాథన్ ` చెన్నై ` సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మీకు పోవడానికి కారణం కొంత మీదోషం కూడా ఉంది, 2వకుజుడు ఉండటం అంతేకాకుండా,సూర్యుడు పాపస్థానంలో ఉండటం అధికారుల ఆగ్రహానికి కూడా ఒక కారణం ఐంది కొంతకాలం ఆగాలి ,కుజ ,శనులకు ప్రీతిగా దానపూజలు చేసుకోండి.
10.సుబ్బారావు `ఇంటికిసరిపోయేద్వారాలు
మీ పేరున తూర్పు దక్షిణాలు రెండూ మీకు పనికొస్తాయి.పడమర ఉత్తరాలు రెండూ వదిలేయాలి.
11.సాయిలు ` కుమారుడి పుత్రజనన దోషవిషయం
డిశంబర్ 2014న మీకుమారుడి పుట్టినసమంలో మఖ నక్షత్రం ఐంది నక్షత్రదోషం ఉంది,కానీ బాలారిష్టదోషాలులేవు విన్నపాటి శాంతి సరిపోతుంది.
12.అనన్య కోషెట్టి ` హైదరాబాదు ` వివాహం
మీకు 2017లో వివాహానికిఅనుకూలసమయంఉంది
13.శ్రీలక్ష్మి ` కోనసముద్రం ` సంతానం
మీకు సంతానానికి ఎలాంటి ఇబ్బందులూలేవు,కానీ మీకుకొంత పుణ్యబలం తక్కువగా ఉంది దానికి కుజప్రీతిగా కందులు, కందిపప్పు ,కారం వస్తువులు దానం చేస్తూండండి.
14.శివాజి ` విశాఖపట్నం ` ఆర్థిక ఇబ్బందులు
మీరు వ్యాపారంలో నష్టాలుండవచ్చు కానీ కొంత దానధర్మాలు చేయడం చాలా అవసరం. పుణ్య కార్యాలు ,దానధర్మాలు చేస్తూండండి.
15.రమవెంకటేష్ ` కూకట్‌పల్లి
మీరు పుట్టిన వివరాలివ్వకుండా ఇన్నిప్రశ్నలడిగితే చెప్పడం ఎలా దయచేసి నియమావళి చదివి పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications