• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీకమాస వ్రతం నేటినుండే ప్రారంభం.. వ్రత ఆచరణ, కలిగే ఫలితాలపై కార్తీకపురాణం ఏం చెప్పిందంటే!!

|
Google Oneindia TeluguNews

శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. నేటి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీకమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివ,కేశవులను పూజిస్తారో వారికి కైవల్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని కార్తీక పురాణంలో చెప్పబడింది.

కార్తీకమాస వ్రత ఆచరణ అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమైనది

కార్తీకమాస వ్రత ఆచరణ అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమైనది

ఇక కార్తీక పురాణం ఆధారంగా కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరించవలసిన వారు ఏం చెయ్యాలి? దాని వల్ల కలిగే ఫలితం ఏమిటి? అనేది కార్తీక పురాణంలో వివరించబడింది. కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. కార్తీక మాస వ్రత ఆచరణ అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమైనది అని చెబుతూ ఉంటారు. అందుకు విశేషమైన కారణం ఉందని కార్తీక పురాణం లో జనకమహారాజు అడిగిన ప్రశ్నకు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పారని చెప్పబడింది. కార్తీకమాస వ్రతాన్ని సూర్యుడు తులా సంక్రమణాదిగా ఉన్నప్పుడు కానీ, శుద్ధ పాడ్యమి నుండి కానీ ప్రారంభించాలని సూచించారు.

కార్తీక వ్రత సంభవం .. సర్వపాప హరణం

కార్తీక వ్రత సంభవం .. సర్వపాప హరణం

సర్వపాపహరం పుణ్యవ్రతం కార్తీక సంభవం.. నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే అని చెబుతారు. కార్తీకమాస వ్రతాన్ని చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని, పుణ్యం కలుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ కార్తీకమాసంలో శివకేశవులకు విశేషంగా పూజలు చేస్తారని కార్తీక పురాణంలో చెప్పబడింది.
కార్తీకమాస వ్రతాన్ని చేయదలచుకున్నవారు ముందుగా వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాము అని నమస్కార పూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానమాచరించాలి.

కార్తీక మాస వ్రతం ఆచరించేవారు చెయ్యాల్సింది ఇదే

కార్తీక మాస వ్రతం ఆచరించేవారు చెయ్యాల్సింది ఇదే

కార్తీక మాస వ్రతం ఆచరించదలచిన వారు సూర్యోదయ వేళ నదీస్నానమాచరించి, పవిత్రమైన ఆత్మతో పూజాదికాలు చేయాలి. సూర్యుడు తులారాశి తో ప్రవేశించిన సమయంలో పవిత్ర గంగానది సమస్త నదీజలాలలో చేరుతుంది. అంతేకాదు సమస్త జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు. అందుకే నదీ జలాలలో స్నానమాచరించి, మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధితో భగవంతుడిని ధ్యానం చేసుకుని కార్తీకమాస వ్రతానికి శ్రీకారం చుట్టాలి. ఆపై శంఖ చక్రధారి అయిన విష్ణువు ను, లింగ రూపుడైన శివుడిని అత్యంత భక్తి ప్రపత్తులతో పూజించాలి.

నెల రోజుల పాటు హరిహర నామస్మరణతో గడపాలి

నెల రోజుల పాటు హరిహర నామస్మరణతో గడపాలి

కార్తీకమాస వ్రతాన్ని ఆచరించే వారు వాక్ శుద్ధి కలిగినవారై హరిహర నామస్మరణలతో నెలరోజులపాటు గడపాలి. ఎట్టి పరిస్థితిలోనూ అన్య మనస్కంగా ఉండరాదు. ఆపై మధ్యాహ్నం శాఖాహార భోజనం చేసి తిరిగి సాయంత్రం వేళ కు, దేవాలయానికి వెళ్ళి యధాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామివారిని ఆరాధించాలి. స్వామి వారికి నైవేద్యం పెట్టి మనసారా ఆయనను స్తుతించి నమస్కరించుకోవాలి.

కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితమిదే

కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితమిదే

కార్తీకమాసం పొడవునా ఈ వ్రతాన్ని ఈ విధంగా ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతారని జనకుడికి వశిష్ఠుడు తెలిపారు. కులాలు, వర్గాలకు అతీతంగా ఎవరు ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తారు వారికి మోక్షం కలుగుతుందని తెలిపారు. తమకు తాముగా వ్రతాన్ని ఆచరించలేని వారు, ఇతరులు వ్రతాన్ని చేస్తుండగా చూస్తే, అతను చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Karthika Masam started today. The Karthika Purana says that the practice of the Karthika masa vrata, which is dear to Shiva and Vishnu, is the best of all virtues. It is said that by performing this Vrata will attain Vaikunta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X