శ్రావణ మాసంలో స్త్రీలు ఆకుపచ్చ చీర, గాజులు ధరిస్తే..ఏం జరుగుతుందో తెలుసా..?

హిందూ క్యాలెండర్‌ ప్రకారం.. సంవత్సరంలో ఐదవ నెలను శ్రావణ మాసంగా చెబుతారు. ప్రస్తుతం ఈ నెల ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. ఆధ్యాత్మికంగా కూడా ఈ మాసం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉందని చెబుతున్నారు. శివకేశవులతో పాటు, వరలక్ష్మీ దేవి, మంగళ గౌరీలను ఈ నెలలో ప్రత్యేకంగా పూజిస్తారు.

అంతే కాకుండా అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందడానికి.. ఈ నెలనే అత్యంత ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. అందుకే ఈ మాసంలోని సోమ, మంగళ, శుక్రవారాల్లో మహిళలు ఉపవాసాలు ఉంటూ పూజలను చేస్తుంటారు. కాగా శ్రావణ మాసంలో ఆచరించే సాంప్రదాయాల్లో ఒకటి ఆకుపచ్చ రంగు దుస్తులు, గాజులు ధరించడం. అయితే దీని వెనుక ఉన్న కారణం చాలా మందికి తెలియదు. అవేంటో మీకోసం ప్రతేకంగా..

reason-behind-women-wear-green-sarees-and-bangles-during-the-month-of-shravan

శ్రావణంలో పచ్చదనం..

శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కురిసే వర్షాల కారణంగా ప్రకృతి మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. అది కొత్త జీవితం, సంతానోత్పత్తిని సూచిస్తుందని అంటున్నారు. ఈ మేరకు మహిళలు కూడా తమ జీవితంలో కొత్త శక్తి, ప్రేమ, శ్రేయస్సు కావాలనే కోరికతో.. నూతనత్వానికి, శక్తికి చిహ్నంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు.

అలానే ఆకుపచ్చ రంగును వైవాహిక ఆనందానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. అందుకే వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, అదృష్టం, మంచి ఆరోగ్యం కోసం శ్రావణ మాసంలో ఆకుపచ్చ గాజులు ధరిస్తారు. ఇది తమ వైవాహిక బంధం పచ్చగా, సంతోషంగా ఉండాలని కోరుకునే నమ్మకంగా భావిస్తారు.

reason-behind-women-wear-green-sarees-and-bangles-during-the-month-of-shravan

పార్వతీదేవికి ప్రీతిపాత్రమైన రంగు..

ఆకుపచ్చ రంగు పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రంగు అని భక్తులు విశ్వసిస్తారు. శ్రావణ మాసంలో శివపార్వతులను ప్రత్యేకంగా పూజిస్తారు. అందుకే ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ బట్టలు ధరించి దేవతను పూజించడం వల్ల.. అంతులేని అదృష్టం, శుభం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు.

reason-behind-women-wear-green-sarees-and-bangles-during-the-month-of-shravan

మరోవైపు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు.. ఆకుపచ్చ రంగుకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉందని వెల్లడిస్తున్నారు. ఆకుపచ్చ రంగు ఒత్తిడిని తగ్గించి.. మానసిక ప్రశాంతతకు సహాయపడుతుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+