Makar Sankranti 2026: సంక్రాంతి ఏ రోజు? పండుగ తేదీపై గందరగోళం

ఈ ఏడాది అధిక మాసం వల్ల పండుగల తేదీల్లో గందరగోళాలు నెలకున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం పెద్ద పండుగలు అన్ని కూడా ఈ సారి రెండు రోజులు వచ్చాయి. దీంతో చాలా చోట్ల ఏ రోజు పండుగ జరుపుకోవాలనేది క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ తికమక సంక్రాంతి పండుగపై పడింది. సంక్రాంతి పండుగను ఏ రోజు జరుపుకోవాలి. పంచాంగం ప్రకారం ఎలా ఉంది. క్యాలెండర్ లో ఏముంది. ప్రభుత్వం సెలవు ఎప్పుడు ఇచ్చింది?

సంబరాల సంక్రాంతి మరోసారి తెలుగులోగిళ్లలో ఉత్సాహంతో నింపేందుకు సిద్ధమవుతోంది. పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ పండుగ వాతావరణం ముందే మొదలైంది. తెల్లవారుజామునే ఇంటి ముందు వేసే రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మల అలంకరణ, పూలతో నిండిన ముంగిళ్లు సంక్రాంతి రాకను చాటుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి, పిల్లల గాలిపటాల హడావుడి... ఇవన్నీ కలిసే సంక్రాంతిని నిజమైన ప్రజల పండుగగా నిలబెడతాయి. సంక్రాంతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే.. ఖండాలు దాటి వెళ్లిన వారిని సైతం గుమ్మం చేరేలా చేస్తుంది ఈ పండుగ. ఇక ఇందులో కొత్త అల్లుళ్ల జోరు మామాలుగా ఉండదు.

పెద్ద పండుగలు రెండు రోజులు..

పంట చేతి కొచ్చిన సందర్భంగా రైతన్నలు చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి . అరిసెలు, బూరెలు, గారెలు, మురుకులు, పాయసం, పులిహోరతో ప్రతి ఇల్లు పండుగ వాసనతో నిండిపోతాయి. ముఖ్యంగా పల్లెల్లో సంక్రాంతి సందడి చెప్పలేనంత ఘనంగా ఉంటే, పట్టణాల్లోనూ సంప్రదాయానికి తగ్గట్టు వేడుకలు జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి పండుగ జరుపుకోవడమే ఈ పర్వదినానికి అసలైన అందం. అయితే ఈసారి అధికమాసం కారణంగా పండుగల తేదీల్లో గందరగోళం నెలకొంది. పెద్ద పండుగలు అన్ని కూడా రెండు రోజులు చేసుకున్నాం మనమంతా.. ఇప్పుడు సంక్రాంతి వంతు వచ్చింది. సంక్రాంతి 14 అని కొందరు.. కాదు కాదు 15 అని మరికొందురు చెప్తున్నారు. ఏది ప్రమాణికంగా తీసుకోవాలి? పండుగను ఎప్పుడు జరుపుకోవాలి?

Sankranti Date Confusion What Panchangam Says Calendar Dates and Government Holiday Details

పండితుల ప్రకారం..

జ్యోతిష్య పండితుల ప్రకారం, మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభక్షణం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభంగా భావిస్తారు. కాల చక్రానికి అధిపతి సూర్యుడు. ఆయన గమనం ఆధారంగా కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. జూలై తరువాత దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఇందులో ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు.

పండుగ ఏ రోజు..?

డిసెంబర్ 14న ప్రారంభమైన ధనుర్మాసం భోగి రోజుతో అంటే జనవరి 14తో ముగుస్తుంది. సాధారణంగా జనవరి పౌర్ణమి, అమావాస్యలను మనం ప్రామాణికంగా తీసుకుంటాం. కానీ ఈ సారి అధిక మాసం కారణంగా ధనుర్మాసం భోగి రోజుతో ముగుస్తుంది. ఇతర పండుగల తేదీలు ప్రతి ఏడాది మారినా, సంక్రాంతి మాత్రం సాధారణంగా జనవరి 14 లేదా 15 తేదీల్లోనే వస్తుంది. కొత్త సంవత్సరం 2026లో జనవరి 15న మకర సంక్రాంతి జరగనుందని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.

పుష్యమాసంలో వచ్చే ఈ పండుగ ఎంతో పవిత్రమైనదని, ఈ కాలంలో దానధర్మాలు, సూర్యారాధన చేస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని పండితుల అభిప్రాయం. మకర సంక్రాంతి రోజున సూర్యనారాయణుడిని పూజించడం, నువ్వులతో చేసిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆయుష్షు, ఆరోగ్యం, సంపద వృద్ధి చెందుతాయని విశ్వాసం. అందుకే ఈ రోజున చాలా మంది శ్రీవేంకటేశ్వర స్వామిని, శ్రీమహావిష్ణువును విశేషంగా పూజిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+