మాఘ నక్షత్రంలోకి కేతువు.. 2026లో ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

నవగ్రహాల్లో కీలకమైన గ్రహం కేతువు. ప్రతి రాశిలో 18 నెలలు సంచారం చేస్తుంది. శనిదేవుడి తర్వాత ఒక రాశిలో ఎక్కువ కాలం సంచారం చేసే రాశుల్లో రాహువు, కేతువు ఉంటాయి. ఇవి రెండూ 18 నెలలకోసారి తమ రాశులను మారుస్తుంటాయి. వీటికి ఛాయాగ్రహాలని పేరు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన కేతువు మాఘ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. నవంబరు 24 వరకు ఆ నక్షత్రంలోనే సంచారం చేసి నవంబరు 25వ తేదీన ఆశ్లేష నక్షత్రంలోకి పవ్రేశిస్తుంది. అలాగే 2026 డిసెంబరు 5వ తేదీన రాశిని కూడా మారుస్తోంది. సింహరాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల వచ్చే ఏడాది మొత్తం కేతువు వల్ల కొన్ని రాశులవారి పంట పండిందని చెప్పొచ్చు.

వృషభ రాశి
వీరు చేపట్టే పనుల్లో వెనకపడతారు. అంతేకాకుండా ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే వీరికి ఉత్తమం. ఆర్థికంగా బాగానే ఉంటారుకానీ చిన్న చిన్న సమస్యలు, స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో ఈ రాశివారు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రేమలో ఉన్నవారి మధ్య గొడవలు జరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే క్రమంలో కూడా అనేక జాగ్రత్తలు అవసరం. రోడ్డు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

Ketu planet enters Magha Nakshatra In 2026 everything these zodiac signs touch will turn to gold

కన్యారాశి
కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పండితులు తెలియజేస్తున్నారు. వ్యాపారాల్లో తీవ్ర నష్టం వచ్చినవారు కోలుకొని మంచి లాభాలను ఆర్జిస్తారు అంతేకాకుండా ఆర్థికంగా బలోపేతమవుతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు కేతువును పూజించడంవల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.

మేష రాశి
మానవ సంబంధాల్లో విభేదాలు తలెత్తుతాయి. స్నేహితులతో కావొచ్చు, బంధువులతో కావొచ్చు, కుటుంబ సభ్యులతో కావొచ్చు గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే వీరికి కొత్త సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. అయితే ఆదాయం మంచిగా పెరుగుతుంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. దీనివల్ల ఆదాయం కనపడుతుంది. మీ చేతుల్లోనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+