అదేంలేదు..బాబే సీఎం:బాలయ్య

అలాగే చంద్రబాబెంతో విజ్ఞానం కలిగిన వ్యక్తని అభివర్ణించారు. 2020 విజన్‌తో ముందుకు పోతున్నారన్నారు. పార్టీ అదిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానన్నారు. ఒకవేళ గెలిచాక మీ స్థానం ఏంటని ప్రశ్నించగా... అర్హతలను బట్టి ఏమైనా ఉంటాయిగానీ... తానేమీ ప్రత్యేకం కాదని పేర్కొన్నారు. పార్టీ కోసం తన సేవలుంటాయన్నారు. కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పడి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే... మీరు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తారా అని ప్రశ్నించగా... పార్టీ తన సొత్తుకాదనీ... విధానం, పద్ధతి అంటూ ఉన్నాయని... ఏదైనా పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications