బ్లేడుతో ప్రేమోన్మాది దాడి

తాడిపత్రి: తనను పెళ్ళిచేసు కోవటానికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది బ్లేడుతో దాడికి దిగాడు. స్ధానిక విజయనగర్‌ కాలనీకి చెందిన షానూ యల్లనూరు రోడ్డులో ఉన్న శ్రీదేవి చిన్నపిల్లల ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తుండేది. అదే నర్సింగ్‌ హోంలో రామంజి కాంపౌండర్‌గా పనిచేసేవాడు. తనను ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఆరు నెలల నుంచి వేధించేవాడు. దాంతో ఇటీవలే షానూ ఆ నర్సింగ్‌ హోంను వదిలిపెట్టి ఆదే రోడ్డులో ఉన్న ఎబిసి చిన్నపిల్లల నర్సింగ్‌ హోంకు మారింది. నిన్న(సోమవారం) రాత్రి 10.30 గంటలకు విధులు ముగించుకుని షానూ ఇంటికి వెళుతుండగా యల్లనూరు రోడ్డులోని రామన్‌ కాలేజి వద్ద రామాంజి ఆమెను ఆపి తనను పెళ్ళి చేసుకోవాలని వెంటపడ్డాడు.

ఇందుకు షానూ నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన రామాంజి సర్జికల్‌ బ్లేడుతో షానూ చేతిపై కోయడంతో షానూ అక్కడి నుండి పరుగులు తీసింది. అయినా వదలని రామాంజి వెంటపడి షానూ చెంపపై కోశాడు. షానూ కిందపడిపోవడంతో మరణించిందని భావించిన రామాంజి అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం షానూను ప్రభుత్వాసు పత్రికి తరలించారు. షానూ ప్రాణాపాయం నుంచి బయటప డిందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+