కర్ణాటకలో భాజపా ఘనవిజయం
బెంగుళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయజనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 8 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా 6 స్థానాల్లో భాజపా విజయం సాధించింది. ఒకచోట జేడీఎస్ గెలిచింది. మరోచోట ఫలితం వెలువడలేదు. దీంతో 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో భాజపా 116 స్థానాలను సాధించినట్లయింది. దీనివల్ల ఆ పార్టీకి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ లభించింది.
ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జెడి (ఎస్), కాంగ్రెస్ పార్టీలు ఘోరాతి ఘోరమైన ఓటమి చవిచూశాయి. కుమారస్వామి భార్య, దేవెగౌడ కోడలు మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఇక కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వలస వెళ్ళిన ముగ్గురు నేతలు కూడా భారీ తేడాతో ఘన విజయం సాధించడం ద్వారా బిజెపి తన సత్తా చాటింది.












Click it and Unblock the Notifications