మళ్ళీ తగ్గనున్న పెట్రో ధరలు?
కోచిః పెట్రోల్‌పై 11 రూపాయలు,డీజిల్‌పై 5 రూపాయల వరకు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతుండటంతో మరోసారి దేశీయంగా ధరలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా తెలిపారు. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న అంతర్యుద్ద పరిస్థితులతో అంతర్జాతీయంగా బ్యారల్ ముడి చమురు ధర మళ్లీ 41 డాలర్లకు చేరుకుంది.
ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి నెల డెలివరీకి గాను బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ధర 2.91 డాలర్లు పెరిగి 41.28 డాలర్లకు చేరుకుంది. అలాగే న్యూయార్క్ లైట్ స్వీట్ క్రూడ్ కూడా 2.74 డాలర్లు పెరిగి 40.45 డాలర్లకు చేరుకుంది.ఇక ఈ నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలను 5, 2 రూపాయల మేర తగ్గించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications