గుడిని కూలుస్తారా?
హైదరాబాద్: స్ధానిక ఫిల్మ్‌నగర్‌లో బల్దియా అధికారుల గుడి కూల్చివేత యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డు విస్తరణకోసం ఇక్కడి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రయత్నాన్ని స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. విషయం తెలిసి భాజపా నేతలు అక్కడికి వచ్చారు. నగరంలో ఒక్కొటొక్కటిగా వరుసగా గుడులు కూల్చటంపై నిలదీశారు.వారు నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించటంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు భాజపా నేత రామచంద్రారెడ్డితోపాటు పలువురిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications