'సత్యం'పై ప్రధాని సీరియస్
న్యూఢిల్లీ: సత్యం వ్యవహారాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ సీరియస్ గా తీసుకోవడంతో ఆర్‌వోసీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సెబీ రంగంలోకి దిగాయి. ఈ సంస్థల అధికారులు గత నాలుగైదు రోజులుగా 24 గంటలూ సత్యం డాక్యుమెంట్ల పరిశీలనలోనే ఉన్నట్లు తెలిసింది.
సత్యం కంప్యూటర్స్ కేసు రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ స్థాయిలోని చిన్న విషయం కాదని, ఇది అంతర్జాతీయ పర్యవసానాలున్న, భారతదేశ ప్రతిష్ఠకు సంబంధించిన అతి పెద్ద వ్యవహారమని కేంద్రం భావిస్తోంది. ఆర్థిక శాఖను స్వయంగా నిర్వహిస్తున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ కుంభకోణంతో షాక్ తిన్నారు. రామలింగరాజు ప్రకటన ప్రకారం చూస్తే.. ఇందులో ఫెమా, ఐటీ చట్టం వంటివి తీవ్రఉల్లంఘనకు గురైనట్లుందని, అత్యున్నత ఆర్థిక సంస్థలపై మచ్చ పడిందని, ఇందులో అంతర్జాతీయ కోణం కూడా ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలోని రాజకీయ కోణం గురించి ఇంటెలిజన్స్ వర్గాలు ఆయనకు నివేదించినట్లు సమాచారం.
ప్రధాని దీనిని సీరియస్‌గా తీసుకోవడంతో ఆర్‌వోసీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సెబీ వంటి సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ మూడు సంస్థలకు చెందిన పది, పదిహేనుమంది అధికారులు గత నాలుగైదు రోజులుగా 24 గంటలూ సత్యం డాక్యుమెంట్ల పరిశీలనలోనే ఉన్నట్లు తెలిసింది. ఈ కుంభకోణంపై ఆర్‌వోసీ కేంద్రానికి ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించింది. మరో రెండు రోజుల్లో తుది నివేదికను కూడా సమర్పించనున్నట్లు తెలిసింది. ఎటు తిరిగి ఎటు వచ్చినా కేంద్రంలోనో, రాష్ట్రంలోనో పెద్ద తలకాయలకు ఈ కుంభకోణం చుట్టుకోక తప్పదని స్పష్టమవుతోంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications